»   » నవ్వులతాత బ్రహ్మీ.., మనవడితో కామెడీ కింగ్ ఆఫ్ టాలీవుడ్

నవ్వులతాత బ్రహ్మీ.., మనవడితో కామెడీ కింగ్ ఆఫ్ టాలీవుడ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెరపై సరే.. మరి నిజజీవితంలో ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే ఆతృత అభిమానులకు తప్పక ఉంటుంది. సాధారణంగా బ్రహ్మానందం తన వ్యక్తిగత విషయాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. సోషల్‌మీడియాలో కూడా చాలా అరుదుగా పోస్ట్‌లు చేస్తుంటారు.

అలా ఎప్పటికో వచ్చే అరుదైన పోస్ట్లలో ఈ మధ్య చేసిన పోస్ట్ మరీ బాగుంది. తన నాలుగు నెలల మనవడు పార్ధ తో బ్రహ్మీ ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. హీరోగా ప్రయత్నాలు చేసిన కాస్త స్లో అయిన బ్రహ్మానందం పెద్దకొడుకు గౌతమ్ మనకు పరిచయమే. ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు చిత్రంతో గౌత‌మ్ టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తర్వాత బ‌సంతి సినిమా తో తెలుగు ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకున్నాడు.

 Comedian Brahmanandam With His Grand Son

ఆ మధ్యన జోత్స్న అనే అమ్మాయిని ఈ కుర్రాడు వివాహమాడాడు. వీరి సంతానమే పార్ధ. ఈ బుల్లోడి రాకతో బ్రహ్మీ కుటుంబంలో చాలా ఆనందాలు అలుముకున్నాయి. అలాంటి ఆయన తన మనవడు పార్థ ను ఎత్తుకుని దిగిన ఫొటోను తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పార్థ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ ఫొటోలో బ్రహ్మానందం తన ముద్దుల మనవడిని చూస్తూ మురిసిపోతూ ఉంటే.. ఆ మనవడు గారేమో తాతయ్యను తదేకంగా చూస్తున్నాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

Brahmanandam autobiography book coming soon | Telugu Filmibeat
English summary
In the above picture, Brahmi could be seen having a blast in the company of the 4-Month-Old Infant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu