For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క‌మెడియ‌న్ గౌతంరాజు తనయుడు హీరోగా కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌

  By Rajababu
  |

  ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌. శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా త‌ణికెళ్ల భ‌ర‌ణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఫ‌స్ట్ షాట్ కి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

  స‌స్పెన్స్ తో కూడిన ల‌వ్ స్టోరీ

  స‌స్పెన్స్ తో కూడిన ల‌వ్ స్టోరీ

  అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో త‌ణి కెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ...``ద‌ర్శ‌కుడు ఒక రోజు వ‌చ్చి క‌థ వినిపించాడు. స‌స్పెన్స్ తో కూడిన ల‌వ్ స్టోరీ . ప్ర‌జంట్ ట్రెండ్ కు త‌గిన విధంగా క‌థ‌ను తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. సూప‌ర్ మార్కెట్ నేప‌థ్యంలో ఉంటుంది. గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ‌కు ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని టీమ్ అంద‌రికీ నా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

  స‌బ్జెక్ట్ కొత్త‌గా ఉంటే

  స‌బ్జెక్ట్ కొత్త‌గా ఉంటే

  సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మాట్లాడుతూ...``ఈ సినిమా పాయింట్ విన్నాను. కథ చాలా కొత్త‌గా ఉంది. ప్ర‌స్తుతం స‌బ్జెక్ట్ కొత్త‌గా ఉంటే సినిమాలు ఆడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ స‌బ్జెక్ట్ బేస్డ్ ఫిలిం కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది. గౌతంరాజు నాకు చాలా కాలంగా ప‌రిచ‌యం. నాన్న‌గారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌గారికి పెద్ద ఫ్యాన్ త‌ను. అందుకే త‌న త‌న‌యుడికి కృష్ణ అని పేరు పెట్టాడు. ఈ సినిమా ద్వారా కృష్ణ‌కు మంచి భ‌విష్య‌త్ ఏర్ప‌డాల‌ని ఆశిస్తున్నా. గౌతంరాజు అనుభవ‌, సినిమా ప‌ట్ల అవ‌గాహ‌న ఈ సినిమాకు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది`` అన్నారు.

  గౌతంరాజు నాకు మంచి మిత్రుడు

  గౌతంరాజు నాకు మంచి మిత్రుడు

  న‌టుడు కృష్ణ భ‌గ‌వాన్ మాట్లాడుతూ... గౌతంరాజు నాకు మంచి మిత్రుడు. వార‌బ్బాయి హీరోగా ప‌రిచ‌యం కావ‌డం చాలా సంతోషం. క‌థ విన్నాను. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌నడంలో ఎటువంటి సందేహం లేదు.

  క‌మెడియ‌న్ కొడుకు హీరో

  క‌మెడియ‌న్ కొడుకు హీరో

  న‌టుడు చిట్టిబాబు మాట్లాడుతూ...గౌతంరాజు నా త‌మ్ముడిలాంటి వాడు. క‌మెడియ‌న్ కొడుకు హీరో అవుతున్నాడంటే ప్ర‌తి క‌మెడియ‌న్ సంతోష‌ ప‌డ‌తాడు. సూప‌ర్ మార్కెట్ ఎలాగైతే అన్ని వ‌స్తువులు ల‌భిస్తాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయ‌న్నారు.

  పెద్ద‌వాళ్లు క‌థ విని చాలా బాగుంద‌న‌డంతో

  పెద్ద‌వాళ్లు క‌థ విని చాలా బాగుంద‌న‌డంతో

  హీరో కృష్ణ మాట్లాడుతూ...``ద‌ర్శ‌కుడు శ్రీనాథ్ కొత్త క‌థ‌తో వ‌చ్చి క‌లిశాడు. చాలా మంది పెద్ద‌వాళ్లు క‌థ విని చాలా బాగుంద‌న‌డంతో ముందుకు వెళ్తున్నాం. ల‌వ్ , స‌స్పెన్స్ , ఎంట‌ర్ టైన్ మెంట్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి. నా పాత్ర పేరు అర్జున్. షావ‌లి గారు మంచి పాట‌లు కంపోజ్ చేస్తున్నారు. సీనియ‌ర్ టెక్నీషియ‌న్స్ సినిమాకు ప‌ని చేస్తున్నారు`` అన్నారు.

  హీరోయిన్ ఎల్సా ఘోష్ మాట్లాడుతూ...``నా ఫ‌స్ట్ తెలుగు సినిమా ఇది. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా న‌టిస్తున్నా అని అన్నారు.

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  కృష్ణ‌, ఎల్సా ఘోష్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో త‌ణికెళ్ల భ‌ర‌ణి, జీవా, గౌతంరాజు, ర‌వి ప్ర‌కాష్‌, సంజు, స్వ‌రూప్ చందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంగీతంః బోలే షావ‌లి, కెమెరాఃఎ విజ‌య్ కుమార్‌, ఎడిట‌ర్ః మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఎమ్మెస్ వాసు, ఫైట్ మాస్ట‌ర్ః స‌తీష్‌, ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ః భువ‌న్ రెడ్డి, పీఆర్వోః ర‌మేష్ చందు, నిర్మాతః బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోష్ , ద‌ర్శ‌క‌త్వంః శ్రీనాథ్ పుల‌కురం.

  English summary
  Comedian Gautam Raju son entered into Tollywood with Krishna Rao Super Market. This movie is directed by P Srinath. Senior actors Tanikelly Bharani, Jeeva, Gautam Raju are the cast. Many actors attended for this movie opening and blessed the Hero Krishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X