»   »  కమెడియన్ పృథ్వీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కమెడియన్ పృథ్వీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో యమ ఫేమస్ అయిపోయాడు కమెడియన్ పృథ్వి. తన కెరీర్ లో చాలా సినిమాలలో నటించినా ఈ చిత్రంలో తనకు వచ్చిన గుర్తింపు మరే సినిమాకి రాలేదని చెప్పుకోవాలి. ఖడ్గం సినిమా తర్వాత పృధ్వి కెరీర్ ఒక ఎత్తయితే....గతేడాది వచ్చిన లౌక్యం సినిమా తర్వాత పృథ్వి కెరీర్ మరొక ఎత్తని చెప్పాలి.

లౌక్యం ద్వారా పృథ్వీ ఏ రేంజ్ లో నవ్వించగలడో అర్ధమైంది. బాయిలింగ్ స్టార్ బ‌బ్లూ ఇక్క‌డ‌.. అంటూ లౌక్యం సినిమాలో తన పాత్రతో కడుపుబ్బా నవ్వించాడు. మొన్న‌టికి మొన్న బెంగాల్ టైగ‌ర్‌లోనూ ఫ్యూచ‌ర్ స్టార్ గా బాగా నవ్వించాడు. వ‌రుస‌గా ఫృద్వీకి మంచి పాత్ర‌లు ప‌డుతున్నాయి. బ్ర‌హ్మానందంకి ద‌క్కాల్సిన‌పాత్ర‌ల‌న్నీ ఫృధ్వీ ఎత్తుకెళ్లిపోతున్నాడ‌ని ఓ టాక్ కూడా న‌డుస్తోంది.

Comedian Prudhvi hikes his remunaration

లౌక్యం సినిమా తర్వాత దాదాపు ప్రతి తెలుగు సినిమాలోనూ పృథ్వి తన కామెడీ విశ్వరూపం చూపిస్తున్నాడు. పృధ్వీకి డిమాండ్‌ పెరగడంతో అతని డేట్స్ ముందే బుక్ చేసుకోవడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పృథ్వి ఒక కాల్షీట్‌ రూ. 50 వేల లోపే ఉండేది. ఇపుడు రోజుకు రూ. లక్షన్నర వరకు ఇచ్చి బుక్ చేసుకుంటున్నారట నిర్మాతలు.

దర్శకులు తమ సినిమాల్లో పృధ్వి కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలు రాయిస్తున్నారట. మున్ముందు పృథ్వీ డిమాండ్ బాగా పెరుగుతుందని అంటున్నారు. అతని రెమ్యూనరేషన్ డబల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అతన్ని హీరోగా పెట్టి కొన్ని సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారట.

English summary
Tollywood comedian Prudhviraj hikes his remuneration.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu