»   » ఇది కళకు, కళాకారుడికి జరిగిన అవమానం: 30 ఇయర్స్ పృథ్వి

ఇది కళకు, కళాకారుడికి జరిగిన అవమానం: 30 ఇయర్స్ పృథ్వి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు కమెడియన్ పృథ్వీరాజ్‌‌ తనకు అనకాపల్లిలో ఎదురైన సంఘటనపై తీవ్రమనోవేదన వ్యక్తం చేసారు. తనకు జరిగిన అవమాన కర సంఘటన గురించి తన ఫేస్‌‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Comedian Prudhvi Raj FB post going viral

'అనకాపల్లి లో షూటింగ్ కోసం నేను, తోటి కళాకారుడు కృష్ణ భగవాన్ వచ్చాం. ఇక్కడ ఒక హోటల్ లో దిగాం. మా బావగారు పిలవడంతో తనని కలవడానికి వెళ్లొచ్చేసరికి నా లగేజ్ అంతా కింద పడి ఉంది. రూమ్ లాక్ నాతోనే ఉంది కానీ, నా అనుమతి లేకుండా నా రూమ్ లోని వస్తువులని కింద పడేయడం నా మనసుకు బాధ కలిగించాయి. కళాకారుడు నలుగురికి ఆనందాన్ని పంచేవాడు. అలాంటి కళాకారుడి మనసును గాయపరచడం పద్దతి కాదు. కళకు, కళాకారుడికి జరిగిన ఈ అవమానానికి చింతిస్తున్నాను. కళను, కళామతల్లిని గౌరవించడమే కళాకారుడికి మీరు చేసే గొప్ప సన్మానం.' అంటూ పృథ్వి పేర్కొన్నారు.

పృథ్వి పెట్టిన పోస్టుకు అభిమానులు భారీగా స్పందించారు. తమ మద్దతు ప్రకటించారు. కొందరైతే ఆ హోటల్ పేరు చెప్పండి వాళ్ల సంగతి చూస్తాం అంటూ ముందుకు రావడం గమనార్హం. వారు పోస్టు చేసిన కామెంట్స్ కొన్ని ఇలా...

* కొందరి బుద్ది అంతే పృథ్వి గారు , మీకు జరిగిన ఈ బాధను మా బాధగా చింతుస్తున్నాము . మీరు ఆ హోటల్ మీద కంప్లెయింట్ చేయండి . ఒక వేళ అది చేసింది చిన్న వర్కర్ ఐతే పెద్ద మనసుతో క్షమించండి. ఒక వేళ మేనేజర్ లెవెల్ ఐతే పెద్దగా ఆక్షన్ తీసుకొని వారికీ సరి అయినా బుద్ది చెప్పండి .

*పృధ్వీ గారు మీకు ఇలాటి అవమానం ఎదురవటం చాల బాధాకరం ....ఇక్కడ మీరు ఒకటి గమనించాలి .....మీరే ఊహించుకోని స్థాయిలో ఇప్పుడు మీరు ఉన్నారు.....అవునుకదా....
మీరు ఎంచుకునె పాత్రల తీరు కొంతమందికి కొన్ని అభిమాన వర్గలవారికిి జీర్ణించుకొలేని విధంగా ఉండి ఉండవచ్చు ....వారికి ఇబ్బంది కలిగించే విధముగా మీ పాత్రలు ఉండి ఉండొచ్చు ఒక నటుడు ఎలాంటి పాత్ర వేసిన అదీ ప్రేక్షకులను కొద్దీ సేపు నవ్వించడానికి మాత్రమే అని ముందు అభిమానులు ప్రేక్షకులు గుర్తుంచుకొవాలి. ఇక్కడ అభిమానులు ప్రేక్షకులు వేరువేరు కాదు అనికూడా అందరూ గమనించాలి. అప్పుడు కళాకారుడికి ప్రజలు ఇచ్చే నిజమైన గౌరవం ....అప్పుడే ఇలాంటి అవమానాలు ఇక జరగవు....ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ....మిత్రమా మీరు ఇక దీని గురించి ఆలోచిం చాల్సినపనిలేదు...మీకు ఇంకా.... మంచి భవిష్యత్తు ముందుంది.

*కళాభిమానం కళాకారుల పట్ల గౌరవం పోతున్న రోజులు..
ఇప్పుడు..మతాభిమానం,ప్రాంతీయభిమానం, కులాభిమానం, రాజ్యమేలుతున్న దుర్దినాలు...
ఇదే నేటి నవ భారతం...భాధ పడకండి సోదరా..

English summary
Comedian Prudhvi Raj FB post going viral in social media. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu