»   » మరీ అంత బూతా? యాంకర్ అనసూయ షోపై కెమెడియన్ పృథ్వి ఫైర్!

మరీ అంత బూతా? యాంకర్ అనసూయ షోపై కెమెడియన్ పృథ్వి ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చలపతి రావు వివాదంపై ప్రముఖ తెలుగు కమెడియన్ '30 ఇయర్స్' పృథ్వి స్పందించారు. 'చలపతి రావు నాకు తండ్రి లాంటి వారు. ఇటీవల ఆడియో వేడుకలో ఆయన మాట్లాడింది మహిళలను కించ పరిచే విధంగా ఉంది తప్పే. మహిళల గురించి ఎవరు అలా మాట్లాడినా తప్పే.' అన్నారు.

'మా డాడీ తరుపున అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఆయన కూడా తను అన్న మాటలకు పశ్చాత్తాప పడుతున్నారు. ఆయన్ను ఇక వదిలేయండి. భౌతికంతా, మానసికంగా చాలా కృంగి పోయారాయన. అదొక పీడకలగా మనం మర్చిపోదాం.' అని మీడియాను, ప్రేక్షకులను కోరారు.

ఇంతకంటే దారుణంగా..

ఇంతకంటే దారుణంగా..

చలపతి రావు కంటే దారుణంగా గతంలో కొందరు కామెంట్స్ చేసారని, అప్పుడు ఎవరూ వారిని ఏమీ అనలేదు. ఇపుడు చలపతి రావు లాంటి వారు మామూలు స్థాయి వ్యక్తులు ఏదైనా చేస్తే అదో పెద్ద ఇష్యూ అవుతోందని పృథ్వి అభిప్రాయ పడుతున్నారు.

బుల్లితెరపై బూతు

బుల్లితెరపై బూతు

‘‘ చలపతి కామెంట్స్ కంటే దారుణమైనవి బుల్లితెరపై చాలా జరుగుతున్నాయి. అదేదో ప్రోగ్రాం ప్రోమోలో..... షేకింగ్ శేషు అని జబర్దస్త్ నుండి వచ్చిన యాక్టర్ మందుందా? అని అడుగుతాడు, దానికి అనసూయగారు నాకంటే కిక్కు మందులో ఉందా? అంటారు.... దీనికి ఆయన మీది లేస్తది, నాది పడిపోద్ది అంటాడు.... ఏంటండీ ఆ మాటలు? ఎటెళ్తున్నాం మనం? ఇంకో ప్రోగ్రాంలో ధనరాజ్, శ్రీముఖి కామెంట్స్ కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి'' అని పృథ్వి అన్నారు.

తల్లి, చెల్లితో చూడలేని విధంగా

టీవీల హవా లేక ముందు ఒకప్పుడు సినిమాలకు వెళితే డబల్ మీనింగ్ డైలాగులని చెల్లెలు, తల్లి, చుట్టాలతో సినిమాలకు వెళ్లలేని పరిస్థితి అన్నారు. తర్వాత కొన్ని యాడ్స్ వస్తుంటే ఇంట్లో కూర్చున్న భార్య కూడా చుట్టాలు వీళ్లందరూ ఉన్నారు అని వారు కూడా కొంత గిల్టీగా పీలై లేచి వెళ్లి పోతున్నారు. అలాగే టీవీలో కొన్ని ఫ్రోగ్రామ్ లు చూస్తే కూడా లేచి వెళ్లి పోతున్నారు అని పృథ్వి అన్నారు. మరి ఎందుకు వీటి మీద దృష్టి పెట్టరు అని ఆయన ప్రశ్నించారు.

ఆయన్ను వదిలేయండి

ఆయన్ను వదిలేయండి

నేను తప్పు చేసాను బాబోయ్... నన్ను వదిలేయండి అని చలపతిరావు అంటున్నా ఆయన్ను ఇంకా టార్గెట్ చేయడం సరికాదు. ఈ వయసులో ఆయన్ను మరింత బాధ పెట్టొద్దు, దీన్ని ఇంతటితో ఆపేద్దామని పృథ్వి చెప్పుకొచ్చారు.

హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్పింది: 30 ఇయర్ పృధ్వి సంచలనం!

హేమ చెప్పుతో కొట్టినట్లు చెప్పింది: 30 ఇయర్ పృధ్వి సంచలనం!

కొందరు హీరోయిన్లు ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను నిర్మొహమాటంగా బయట పెడుతున్నారు. తమతో పడుకుంటేనే అవకాశాలు ఇస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై కమెడియన్ పృథ్వి స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Reacting to Chalapathi Rao vulgar comments, another comedian Pruthvi condemned him and asked for an apology on behalf of him defending that his father is a close friend of Chalapathi Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu