Don't Miss!
- News
గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి: మంత్రి గుడివాడ లేఖ: సింగిల్ పేజ్‌లో ఫుల్ క్లారిటీ
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సునీల్ చేసిన తప్పే సప్తగిరి కూడా చేశాడు.. అందుకే సినిమాల్లేవ్!
సినిమా ఇండస్ట్రీలో సరైన క్యారెక్టర్ తగిలితే చాలు ఒక్కరోజులోనే స్టార్ అయిపోవచ్చు. అయితే ఆ ఒక్క లక్కీ ఛాన్స్ రావడానికి సమయం చాలానే పడుతుంది. ఓపికతో అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటు ముందుకు వెళ్ళాలి. అయితే కమెడియన్ హోదా నుంచి హీరోగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందులో సక్సెస్ అయిన వారు తక్కువమంది ఉన్నారు. ఇక ఇటీవల సునీల్ చేసిన తప్పే సప్తగిరి కూడా చేశాడని విమర్శలు వస్తున్నాయి.

స్టార్ కమెడియన్స్
కమెడియన్స్ హీరోగా చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే ఆ క్యాటగిరిలో అందరూ సక్సెస్ కాలేకపోయారు. అలీ బ్రహ్మానందం వంటి టాప్ కమెడియన్స్ కూడా అప్పుడప్పుడు హీరో అనే ట్యాగ్ ని టచ్ చేసి వచ్చిన వారే.. అయినప్పటికీ ఒకే చోట ఆగిపోకుండా స్టార్ కమెడియన్స్ కొనసాగుతున్నారు.

సునీల్ చేసిన పొరపాటు..
ఒకప్పుడు కమెడియన్ గా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన వారిలో సునీల్ ఒకరు. కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఒక పొరపాటు చేశాడు. హీరోగా రెండు సినిమాలు హిట్టవ్వగానే కామెడీ పాత్రలను వదిలేశాడు. మరోవైపు హీరోగా వరుస డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు కమెడియన్ గా సెట్టవుదామని అనుకుంటే సరైన ఛాన్సులు రావడం లేదు.

సప్తగిరి పరిస్థితి కూడా అంతే..
కమెడియన్ గా రోజుకు ఏడాదికి 20కి పైగా సినిమాలతో బిజీగా గడిపిన సప్తగిరి ఇప్పుడు కమెడియన్ ఛాన్సులు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి LLB, అంటూ ఆ మధ్య హడావుడి చేసిన ఈ యాక్టర్ ఎలాంటి సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో కమెడియన్ గా చేయడేమో అని దర్శకనిర్మాతలు అతని దగ్గరకు వెళ్లడం లేదు.

కమెడియన్స్ గా క్లిక్కవ్వాలని..
వెన్నెల కిషోర్ కూడా కొన్ని సమయాల్లో హీరోగా ట్రై చేయాలని అనుకున్నాడు. కానీ కమెడియన్ గానే ఒక బ్రాండ్ సెట్టవ్వడంతో సంతృప్తి చెంది హ్యాపీగా కామెడి రోల్స్ చేసుకుంటున్నాడు. సునీల్, సప్తగిరి మాత్రం హీరోగా సెట్టవ్వలని ఉన్న కామెడీ ఇమేజ్ ని కూడా చెడగొట్టేసుకున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా వీరికి యూ టర్న్ ఇచ్చే రోల్స్ తగులుతాయో లేదో చూడాలి.