»   » కమెడియన్ సప్తగిరి హీరోగా సినిమా....

కమెడియన్ సప్తగిరి హీరోగా సినిమా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: న్యూజనరేషన్ టాప్ కమెడియన్ సప్తగిరి హీరోగా సినిమా రాబోతోంది. సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ఆయన శిష్యుడైన ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి సొంతంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

Comedian Sapthagiri As Hero!

రుగ్వేద డ్రీమ్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరిలో మొదలుకానుంది. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ...‘చాలా మంచి సబ్జెక్టుతో ఈ సినిమా చేస్తున్నా. నా శిష్యులైన ప్రముక దర్శకులు శ్రీను వైట్ల, వివి వినాయక్, ఏఎస్ రవికుమార్ చౌదరి, నాగేశ్వరరెడ్డిలు ఈ సినిమా రూపకల్పనలో నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు చాలా గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఇలా శిష్యుల సహకారంతో ఓ గురువు సినిమా చేయడం నిజంగా గొప్ప విషయమే' అన్నారు.

Comedian Sapthagiri As Hero!

రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...మమ్మల్ని ఇండస్ట్రీలో పెంచి పోషించి ఈ స్థాయికి రావడానికి కారకులైన మా గురువుగారికి శిష్యులందరం చేస్తున్న సత్కారం లాంటిది ఈ చిత్రం. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.

Comedian Sapthagiri As Hero!

తెలుగులో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కమెడియన్లలో సప్తగిరి ఒకరు. ఈ మధ్య కాలంలో వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ సప్తగిరి అవకాశాలు దక్కించుకుంటున్నాడు. కొన్ని చిన్న సినిమాలైతే సప్తగిరి లాంటి కమెడియన్లపైనే ఆధారడి తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను హీరోగా రావడంపై జనాల్లోనూ ఆసక్తి నెలకొంది. హాస్య ప్రధాన చిత్రంగా ఇది తెరకెక్కబోతోంది.

English summary
Well-known comedian Sapthagiri is all set to turn as lead hero. Sapthagiri will be making his debut as hero in an upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu