»   » పూర్తి స్థాయి హీరోగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

పూర్తి స్థాయి హీరోగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో వచ్చిన పలు చిత్రాల్లో తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. కమెడియన్లు ఏదో ఒక సందర్భంలో హీరో అవతారం ఎత్తడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అదే దారిలో శ్రీనివాసరెడ్డి కూడా ప్రయాణిస్తున్నాడనిఫిల్మ్ నగర్ టాక్.

ఆ మధ్య అంజలి హీరోయిన్ గా తెరకెక్కిన ‘గీతాంజలి' చిత్రంతోనే శ్రీనివాసరెడ్డి హీరోగా ఇంట్రడ్యూస్ కావాల్సి ఉంది. అయితే శ్రీనివాసరెడ్డి హీరోగా పరిచయం చేస్తే సినిమాపై నెగెటివ్ ప్రభావం పడే అవకాశం ఉండటంతో అతన్ని సినిమాలో హీరోగా కాకుండా, కథను నడిపించే ముఖ్య పాత్రధారిగా మాత్రమే పరిమితం చేసారు.

Comedian Srinivasa Reddy turns hero

కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో శ్రీనివాస్ రెడ్డి చిన్న చిన్న పాత్రలు పరిమితం అయ్యారు. తర్వాత హీరో ఫ్రెండు పాత్రలు చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువగా విజయం సధించినవే. ఈ క్రమంలో తను హీరో కావాలనే లక్ష్యంతో ‘గీతాంజలి' చిత్రానికి తన వంతు ప్రయత్నం చేసారు. అయితే ఇందులో హీరోగా కాకుండా మామూలు పాత్రకే పరిమితం అయ్యాడు.

తాజాగా శ్రీనివాస్ రెడ్డికి పర్ ఫెక్టుగా సూటయ్యే కథ దొరికిందని, ఈ చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నరు.

English summary
Comedian Srinivasa Reddy would soon make his debut as the male lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu