రాజమౌళి సినిమాలో విలన్ పాత్రకోసం సునీల్ వెయిటింగ్

'పెద్ద దర్శకుల సినిమాల్లో విలన్ పాత్రలు చేయాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. దర్శకుడు రాజమౌళికి పెద్ద అభిమాని. మర్యాదరామన్న సినిమాకు నన్ను హీరోగా తీసుకున్నారు. అదే విధంగా ఆయన దర్శకత్వంలో విలన్ పాత్రలు చేసే అవకాశం కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే అలాంటి అవకాశం రాలేదు.' అని సునీల్ వెల్లడించారు.
'రాజమౌళి దర్శకత్వంలో విలన్ పాత్ర చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా వెంటనే సంతోషంగా ఒకే చెబుతాను. ఇతర ఫిల్మ్ మేకర్స్ చిత్రాల్లోనూ మంచి అవకాశాలు వస్తే విలన్ పాత్ర చేయడానికి సిద్ధమే' అని చెప్పుకొచ్చారు సునీల్. 'కమెడియన్‌గా ఉన్నపుడు సంవత్సరానికి 10 సినిమాల వరకు చేసే వాడిని. కానీ హీరోగా సంవత్సరానికి 2 సినిమాలు చేయడం కూడా కష్టమే అవుతోంది' అన్నారు.
39 ఏళ్ల సునీల్ త్వరలో 'భక్త కన్నప్ప' అనే పౌరాణిక చిత్రంలో నటిచండానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారు. తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భర్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











