twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ' రాంబాబు' కి ప్రభుత్వ కమిటీ చెప్పిన కట్స్ ఇవే...

    By Srikanya
    |

    హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' తెలంగాణా వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏడు సీన్లను కత్తిరించాలని సూచిస్తూ సమాచారశాఖ మంత్రి డీకే అరుణకు శనివారం నివేదికను అందజేసింది.

    ఆ నివేదికను పరిశీలించి నిర్ణయం ప్రకటించనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సినిమాపై వివాదం నేపథ్యంలో మంత్రి ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అల్లాణి శ్రీధర్‌, ఎన్‌.శంకర్‌, టి.భరద్వాజ, విజయేందర్‌రెడ్డి, వందేమాతం శ్రీనివాస్‌, దిల్‌రాజు, అల్లం నారాయణ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ అల్లం నారాయణ, దర్శకుడు శంకర్ మాత్రం కమిటీని బహిష్కరించారు. కమిటీ సభ్యులు సినిమా చూసి ఏడు సీన్లను తీసేయాలని నిర్ణయించారు.

    ఆ కట్స్ ఏమిటంటే...

    * తెలుగుతల్లిపై దృశ్యాలు

    * ఢిల్లీ అతిథిగృహంలో లీడర్‌ ఉన్నది

    * బ్యాక్‌గ్రౌండ్‌లో నిజాం నవాబు ఫొటో కనిపిస్తున్న దృశ్యం

    * తెలంగాణ కావాలా వద్దా అనే మాటలున్నది

    * ఆత్మహత్యలపై ఉన్న మాటలు

    * హాస్టళ్ల విద్యార్థులను ఉద్యమంలోకి తెస్తున్నారనే దృశ్యం

    * సెటిలర్లు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారనే మాటలు

    చిత్ర ప్రదర్శన అనంతరం తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు విజయేందర్‌డ్డి మాట్లాడుతూ సినిమాలో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.

    మరో సభ్యుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ దర్శకుడు, నిర్మాతకు ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంటుందని, దాన్ని వారు గుర్తెరగాలని సూచించారు. మిగిలిన సభ్యుల అభివూపాయాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఇదిలా ఉండగా. చెత్త సినిమాలను తాము ఒప్పుకోబోమని, అందుకే ప్రభుత్వం ఈ సినిమా పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీని దర్శకుడు ఎన్ శంకర్‌తో కలిసి తాను బహిష్కరించానని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు.

    English summary
    Information and Broadcasting Minister DK.Aruna constituted a committee which will be headed by RV.Chandravadan, MD of Film Development Corporation (FDC), AP who will review Pawan Kalyan, Tamanna starrer ‘Cameraman Gangato Rambabu’ film directed by Puri Jagannath. The committee will decide on the objectionable scenes which will be deleted before passing its final verdict on clearing the film once again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X