twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డ్‌ రగడ...లేడీ ఆఫీసర్‌పై ఫిర్యాదు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా సెన్సార్ బోర్డ్ పై, లేడీ ఆఫీసర్ ధనలక్ష్మిపై కొందరు నిర్మాతలు, దర్శకులు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె కఠినంగా వ్యవహరిస్తుండటంతో చాలా సినిమాలు 'A'(పెద్దలకు మాత్రమే పరమితం) సర్టిఫికెట్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

    దీంతో బూతు సినిమాలు, బూతు డైలాగులతో పాటు...భారీ యాక్షన్ హింసాత్మక సినిమాలు తీసి లాభాలు గడిద్దామనే నిర్మాతలు, దర్శకుల ఆటలు సాగడం లేదు. A సర్టిఫికెట్ ఉన్న సినిమాలు టీవీల్లో రాత్రి 11 గంటల తర్వాతే ప్రదర్శించుకోవాలనే కొత్త నింబంధ నేపథ్యంలో చాలా సినిమాలకు శాటిలైట్ రైట్స్ కూడా పెద్దగా రావడం లేదు. దీంతో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు లబోదిబోమంటున్నారు.

    ఈ నేపథ్యంలో లేడీ ఆఫీసర్ ధనలక్ష్మిపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అంబికా సోనికి ఫిర్యాదు చేసారు. ధనలక్ష్మికి తెలుగు నేటివిటీ గురించి తెలియదని, ఆమె తెలుగు సెన్సార్ బోర్డు ఆఫీసర్ గా ఉండటానికి అనర్హురాలని కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి సీనియర్ సెన్సార్ బోర్డ్ మెంబర్ విద్యా సాగర్ రావు పలువురు అంబికా సోనిని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

    అంతే కాకుండా ధనలక్ష్మిపై పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ధనలక్ష్మి కొందరికి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారని, కొన్ని సినిమాలకు A సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉన్నా....U/A సర్టిఫికెట్ ఇస్తున్నారని వారు అంబిక సోని దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై మంత్రి అంబికా సోని స్పందిస్తూ....సెన్సార్ బోర్డ్ మెంబర్స్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

    English summary
    
 Some of the members of the Board along with a few local MPs, lodged a formal complaint against A Dhanalakshmi, the regional officer of the AP Censor Board, in Delhi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X