»   » బాలయ్య 101వ మూవీ: పరుగులు పెట్టిస్తున్న పూరి, అంతా షాక్!

బాలయ్య 101వ మూవీ: పరుగులు పెట్టిస్తున్న పూరి, అంతా షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో చాలా స్పీడుగా సినిమాలు తీసే దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కి పేరుంది. ఇపుడు అదే స్పీడును బాలయ్య 101వ సినిమా విషయంలోనూ కొనసాగిస్తున్నారు పూరి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

దీన్ని బట్టి పూరి.... తను అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేయడానికి బాలయ్య తో పాటు యూనిట్ మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పూరి స్పీడు చూసి అభిమానులు ఓ వైపు షాకవుతూనే.... వీలైనంత త్వరగా బాలయ్య సినిమా థియేటర్లలోకి వస్తుందని మరో వైపు ఆనందంగా ఉన్నారు.

పూరి ట్వీట్

తొలి షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్స్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసారు. ఎన్‌బికె 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది, భారీ సెట్ లో యాక్షన్ సీన్లు పూర్తి చేశాం. ఈ సీన్లు చాలా బాగా వచ్చాయని, బాలయ్య అభిమానులకు కన్నుల పండుగగా ఈ సీన్లు ఉంటాయని ట్వీట్ చేసారు.

సెకండ్ షెడ్యూల్

సెకండ్ షెడ్యూల్

ఇక ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 7 తేదీ వరకు లండన్‌లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పూరి నిర్ణయం మార్చుకున్నాడా?

పూరి నిర్ణయం మార్చుకున్నాడా?

మొన్నటి దాకా బాలకృష్ణ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు కావాలని కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చి హడావిడి చేసిన పూరి జగన్నాథ్‌ ఇప్పుడు రూట్‌ మార్చినట్టు కనిపిస్తోంది. అందరూ కొత్త వాళ్ళని కాకుండా సీనియర్స్‌ని తీసుకుంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో పడ్డాడట. ఈ మేరకు కొందరు హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించాడని సమాచారం.

దుష్ప్రచారం

దుష్ప్రచారం

హాలీవుడ్ లో మంచి హిట్టైన 'జాన్ విక్'(2014)చిత్రం ఆదారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్యకు తగినట్లు పూరీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని... ప్రచారం జరుగుతోంది. అయితే పూరి జగన్నాధ్ అంత చీప్ గా హాలీవుడ్ సినిమాని యాజటీజ్ లేపుతాడా..అదీ వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న సమయంలో అంటే నమ్యశక్యంగా లేదని అంటున్నారు ఆయన అభిమానులు. ఇది పూర్తిగా దుష్ప్రచారమే అని తేల్చేస్తున్నారు.

సినిమా టైటిల్ టపోరి అంటూ ప్రచారం

సినిమా టైటిల్ టపోరి అంటూ ప్రచారం

పూరి, బాలయ్య సినిమా టైటిల్ ఏంటీ అనే చర్చ ఓ వైపు సాగుతుండగా....‘టపోరి' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు జోరుగా ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది

English summary
Completed my 1st schedule of NBK101 in a massive set n action sequence .. it's gonna be feast for all NandamuriBalakrishna fans Puri tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu