twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆగడు' కాపీ వివాదం :సంగీత దర్శకుడు వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : తాజాగా మహేశ్‌ హీరోగా నటిస్తున్న 'ఆగడు' రెండో టీజర్‌ కాపీ కాంట్రవర్శిలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్...మళయాళ చిత్రం 'అవతారం 'టీజర్ నుంచి లిప్ట్ చేసారని అంతటా వినిపించింది. దీనిపై టీవి ఛానెల్స్ పోగ్రామ్ లు సైతం చేసేసాయి. ఈ నేపధ్యంలో అవతారం చిత్రం కంపోజర్ వివరణ ఇచ్చారు. అది తమ పొరపాటే అని చెప్పుకొచ్చి తమన్ కి రిలీఫ్ ఇచ్చాడు.

    అవతారం కు సంగీతం అందించిన మళయాళి మ్యూజిక్ డైరక్టర్ దీపక్ దేవ్ మాట్లాడుతూ... తమ ఎడిటర్ పొరపాటున ఆగడు సౌండ్ ట్రాక్ ని డమ్మీ ట్రైలర్ కి వాడాడన్నారు. అయితే ఆ ట్రాక్ మహేష్ బాబు ఆగడు చిత్రం ది అనే విషయం తెలియదని అన్నారు. ఆన్ లైన్ నుంచి ఓ డమ్మీ ట్రాక్ తీసుకుందామనే ప్రయత్నంలో జరిగిన పొరపాటు అన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తాను ఇంకా అవతారం చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని అన్నారు. తన ఎడిటర్ అత్యుత్సాహంతో ఆన్ లైన్ లో దొరికిన ట్రైలర్ ..ఎక్కడిదో తెలియకుండా వాడేసాడని, తను చూసుకోలేదని అని వివరణ ఇచ్చారు.

    Composer Reacts On Aagadu controversy

    తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత దర్శకుడు. కృష్ణ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్‌ తరహాలోనే ఈ రెండో టీజర్‌లో హైవోల్టేజి యాక్షన్‌ సీన్లు, పంచ్‌ డైలాగులు ఉన్నాయి.

    మహేశ్‌ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టిందంట', 'అయినా నువ్వు డైలాగ్‌ వేస్తే కౌంటర్‌ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్‌ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త టీజర్‌తో 'ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఒక 'ఫీలర్‌' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా మహేశ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్‌ అందించిన మాస్‌ మసాలా గీతమిది. ఇందులో మహేష్‌, శ్రుతిహాసన్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    
 Music director Deepak Dev, who scored for Avataram, confirms that his editor has used the sound track of Aagadu as a dummy scoring for the trailer. He revealed that his editor has used that track from online and he doesn't even know that it is background score of Mahesh Babu's Aagadu. 'I've not even composed BG score for Avataram yet. Being an enthusiast, our editor used already available tracks online including Aagadu music, to cut the trailer. I'm now aware of it', says Deepak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X