»   » ఆ రూమర్సే నిజం కాబోతున్నాయి: పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్!

ఆ రూమర్సే నిజం కాబోతున్నాయి: పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ తమిళ మూవీ రీమేక్ లో నటించబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మరేదో కాదు తమిళ స్టార్ అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ 'వేదాళం'. ఈచిత్రం రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడనేది ఇన్నాళ్లూ రూమర్ మాత్రమే. ఇపుడు అదే నిజం కాబోతోంది.

తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన వేదాళం చిత్రం అక్కడ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే బావుంటుందని ప్రముఖ నిర్మాత ఎఎం.రత్నం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎట్టకేలకు ఎఎం.రత్నం ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నుండి ఆయనకు ఈ సినిమా రీమేక్ విషయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అటు పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం ఎఎం.రత్నం తన ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఆర్.టి.నేసన్ అనే దర్శకుడిని ఎంపిక చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ దర్శకుడు గతంలో తమిళంలో విజయ్ తో 'జిల్లా' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇపుడు పవన్ కళ్యాణ్ సినిమాలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చాయి

పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చాయి

తమిళంలో అజిత్‌, విజయ్‌ చేసిన సినిమాలు పవన్‌ కళ్యాణ్‌కి బాగా కలిసొచ్చాయి. అందుకే వాళ్ల చిత్రాల్ని పవన్‌ ఎక్కువగా రీమేక్‌ చేశారు.

వేదాళం కూడా..

వేదాళం కూడా..

వేదాళం సినిమా రీమేక్ చేయడానికి పవన్ నిర్ణయించుకోవడం వెనక కూడా కారణం అదే...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

గతంలో పవన్ కళ్యాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమ రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేయాల్సి ఉంది అన్నారు.

ప్రస్తుతం...

ప్రస్తుతం...

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

నెక్ట్స్ మూవీ...

నెక్ట్స్ మూవీ...

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే వేదాళం రీమేక్ ప్రారంభం కానుంది. అందుకే డాలీతో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు వేదాళం రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడానికి ప్లాన్ చేసారు.

English summary
Pawan Kalyan to star in Telugu remake of Ajith's 'Vedalam'. “Vedalam”, which featured Tamil superstar Ajith Kumar, was one of the biggest hits of last year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu