»   » యాడ్ లో నటించి ఇరుక్కున్న ఆమిర్‌ ఖాన్, అగ్రహం, వివాదం

యాడ్ లో నటించి ఇరుక్కున్న ఆమిర్‌ ఖాన్, అగ్రహం, వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: అమీర్ ఖాన్ ఊహించని విధంగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. ముంబయి బీఎంసీ ఎన్నికలకు చెందిన వివాదం ఒకటి ఆమిర్‌ ఖాన్‌ను చుట్టుముట్టింది. ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమిర్‌ ఖాన్‌ ఓ ప్రకటనలో నటించాడు. నగర సమస్యలను పేర్కొంటూ ముంబయివాసులూ ఓటు వెయ్యండి.. అంటూ ఆమిర్‌ నటించిన ప్రకటన భాజపాకు దోహదపడేలా ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దాంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బుధవారం మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు చేయనుంది. అయితే ఆమిర్‌ నటించిన ఈ ప్రకటన ముంబయికి చెందిన ఫస్ట్‌ ఆర్గనైజేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ వేయించింది. కానీ ఈ సంస్థతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు సంబంధాలు ఉన్నాయని ఇతర పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌ తేదీన భాజపాకు మద్దతుగా ఈ ప్రకటన చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Congress allege Aamir’s ‘vote kar’ ad violated code of conduct, BJP says rivals desperate

ఫిబ్రవరి 19న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సాయంత్రం 5.30 తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని నిబంధనలు విధించింది. అదే సమయంలో ఆమిర్‌ నటించిన ప్రకటన మరుసటి రోజు ఆంగ్ల, మరాఠీ వార్తాపత్రికల్లో ప్రచురితమవడంతో ఆమిర్‌ చిక్కుల్లోపడ్డాడు. ఈ ప్రకటన చేయించింది స్వచ్ఛంద సంస్థే అయినా అది ఫడణవీస్‌కి తెలిసిన సంస్థ కాబట్టి భాజపాకు మద్దతుగా ఆయనే ఈ ప్రకటన చేయించి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధమని దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రతినిధి సచిన్‌ సావంత్‌ తెలిపారు. ఈ విషయమై చర్యలు తీసుకుంటామని ప్రస్తుతానికైతే ఎలాంటి ఫిర్యాదు రాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జేఎస్‌.సహారియా తెలిపారు.


అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.... దంగల్ ఘన విజయంతో జోష్ మీద ఉన్న అమీర్ ఖాన్ తర్వాత చేయబోయే చిత్రంపై క్లారిటీ వస్తున్నది. ప్రతిష్ఠాత్మకంగా రూపొందబోయే ప్రముఖుడి బయోపిక్‌లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ నటించనున్నట్టు తెలుస్తున్నది. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితంలోని కీలక అంశాలను బాలీవుడ్‌లో తెరెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాకేశ్ శర్మగా నటించడానికి అమీర్ ఖాన్ ఓకే చెప్పినట్టు సమాచారం.

అంతరిక్షంలో భారత జెండాను రెపరెపలాడించిన రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కె చిత్రానికి సెల్యూట్ అనే పేరు పరిశీలన ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ నిర్మిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల అమీర్ ఖాన్‌ను కలిసిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ను అందజేసినట్టు సమాచారం.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌తో కలిసి అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధూమ్-3 చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యష్ రాజ్ బ్యానర్ పై రూపొందుతున్నది.

English summary
A full page advertisement featuring superstar Aamir Khan sparked controversy on Tuesday, with Shiv Sena, NCP and Congress alleging that the ad violated the election code of conduct by promoting rival BJP in the BMC polls. The model code of conduct prohibits political parties from carrying out any promotions in the 48 hour period prior to elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu