Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హీరోయిన్లు రంభ, రాశి అలాంటి ఫొటోలతో.. మోసం బయటపడింది, దిమ్మ తిరిగే షాక్!
Recommended Video

సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. రంభ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలయ్య సరసన పలు చిత్రాల్లో నటించింది. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోల సరసన రాశి ఎక్కువగా నటించింది. తాజాగా వీరిద్దరికి న్యాయస్థానం వార్నింగ్ ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది.

సినిమాలు తగ్గించారు
హీరోయిన్ రంభ వివాహం తర్వాత వెండి తెరపై కనిపించలేదు. ఆ మధ్యన యమదొంగ చిత్రంలో రంభ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత దొంగసచ్చినోళ్ళు అనే చిత్రంలో నటించింది అదే ఆమెకు చివరి చిత్రం. ఇక రాశి 2004 తర్వాత సినిమాలు బాగా తగ్గించింది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

అలాంటి ఫొటోలతో
సినిమా సెలెబ్రిటీలు అంటే సాధారణంగా వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తుంటారు. అలా రాశి, రంభ కలర్స్ అనే సంస్థకు ప్రచారం కల్పిస్తున్నారు. ఏ ప్రకటనల్లో రంభ, రాశి బాగా బరువు పెరిగి ఉన్న ఫోటోలని, బాగా స్లిమ్ గా మారిన ఫోటోలని చూపిస్తారు. మీరు కూడా రంభ, రాశిలాగా మేమిచ్చే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటే నాజూగ్గా తయారవుతారని వినియోగదారులని ఆకర్షిస్తారు. దీనితో బరువు ఉన్న చాలా మంది ఈ వైద్యం ప్రారంభించారు.

బయటపడ్డ చీటింగ్
ఈ ట్రీట్మెంట్ వలన తమకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ఓ వ్యక్తి నేరుగా రంభ, రాశిపై కేసు నమోదు చేశాడు. విజయవాడలో వినియోగదారుల ఫోరమ్ కోర్టులో ఫిటిషన్ వేయడంతో శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. రంభ, రాశి ఇలాంటి ప్రకటనల్లో పాల్గొంటుండడం వలన తనతో పాటు చ,చాలా మంది వినియోగదారులు మోసపోతున్నామని అతడు పిటిషన్ లో వివరించాడు.

ఇలాంటి ప్రకటనలు చేయకండి
దీనితో న్యాయమూర్తి తగిన ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారుడు చెల్లించిన రూ.75,000 మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ప్రకటనలు నిర్వహిస్తున్న కలర్స్ సంస్థని ఆదేశించారు. ఇక రంభ, రాశి లకు కూడా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. మోసపూరితమైన ప్రకటనల్లో పాల్గొని ప్రతిష్ఠ దిగజార్చుకోకండి అని రంభ, రాశి లకు న్యాయమూర్తి సూచించారు. సెలేబ్రిటిగా ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సెలెబ్రిటీ గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి అన్నారు.