»   » శ్రీదేవి కేసులో దుబాయ్ రాజు ప్రమేయం కూడా..బోని కపూర్ ని 18 గంటలుగా!

శ్రీదేవి కేసులో దుబాయ్ రాజు ప్రమేయం కూడా..బోని కపూర్ ని 18 గంటలుగా!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం విషాదానతనికి దారితీసే ప్రమాదంలో పడింది. శ్రీదేవి మరణించడమే భారతీయ సినీ అభిమానులకు పెద్ద షాక్. అలాంటిది ఆమె అనుమాస్పదంగా మృతి చెందడం, తాజాగా మీడియాలో వస్తున్న కథనాలతో శ్రీదేవి అభిమానుల్లో వేదన ఎక్కువవుతోంది. శ్రీదేవి బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. ఈ రిపోర్ట్ పై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గత 18 గంటలుగా శ్రీదేవి భర్త బోనికపూర్ ని పోలీస్ లు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Sridevi : Cops Question Boney Kapoor, Statement Recorded
బాత్ టబ్ లో పడిపోవడం ఏంటి

బాత్ టబ్ లో పడిపోవడం ఏంటి

శ్రీదేవి పోస్ట్ మార్టం అనంతరం విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ అనుమానాలన్నింటికీ కారణం అవుతోంది. ప్రమాదవశాత్తు శ్రీదేవి టబ్ లో పడి మృతిచెందినట్లు రిపోర్ట్ లో రాశారు. మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీన్లోకి వచ్చింది.

బోని కపూర్ ని 18 గంటలుగా

బోని కపూర్ ని 18 గంటలుగా

సోమవారం నుంచి భారత మీడియాలో ఈ వార్తలు వెలువడుతున్నాయి. శ్రీదేవి మృతిలో అనుమానాల్ని నివృత్తి చేసుకోవడానికి దుబాయ్ పోలీస్ లు 18 గంటలుగా బోని కపూర్ ని విచారిస్తానట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అతడి పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

విచారణ పూర్తయ్యే వరకు

విచారణ పూర్తయ్యే వరకు

విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్ లోనే ఉండాలని పోలీస్ లు బోని కపూర్ ని ఆదేశించినట్లు తెలుస్తోంది.

గుచ్చి గుచ్చి ప్రశ్నలు

గుచ్చి గుచ్చి ప్రశ్నలు

శ్రీదేవి మృతి విషయంలో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు దుబాయ్ పోలీస్ లు బోనికపూర్ ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్లు, విచారణకు సంబందించిన కొన్ని ప్రశ్నలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి.

భిన్నంగా దుబాయ్ మీడియా

భిన్నంగా దుబాయ్ మీడియా

భారత మీడియాలో వస్తున్న కథనాలకు భిన్నంగా దుబాయ్ మీడియా స్పందించింది. బోనికపూర్ ని విచారణ చేపట్టలేదని అంటోంది.

ఫార్మాలిటీ మాత్రమే

ఫార్మాలిటీ మాత్రమే

శ్రీదేవి మృతి చెందిన నేపథ్యంలో భర్తగా బోనికపూర్ కొన్ని పార్మాలిటీస్ పూర్తి చేయవలసి ఉంటుంది. అందువలనే ఆయన స్టేట్మెంట్ ని పోలీస్ లు తీసుకున్నారు. ఇది విచారణ కాదని, భారత మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటోంది.

ఛాన్సే లేదు

ఛాన్సే లేదు

ఒకవేళ పోలీస్ లు నిజంగానే విచారణ చేపట్టి ఉంటే దుబాయ్ నిబంధనలు ప్రకారం ఆ వివరాలు బయటకు వచ్చే అవకాశమే లేదని కొందరు అంటున్నారు.

దుబాయ్ రాజు కూడా

దుబాయ్ రాజు కూడా

దుబాయ్ చట్టాల ప్రకారం విచారణ జరుగుతున్న కేసులో దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదని అంటున్నారు. అధికారులు అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే ఈ కేసులో తదుపరి వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

అందుకే ఈ ఊహాగానాలు

అందుకే ఈ ఊహాగానాలు

శ్రీదేవి దుబాయ్ లో మరణించారు. దీనికి సంబందించిన విచారణ మొత్తం దుబాయ్ అధికారులే చేస్తున్నారు. మన ఎంబసీ అధికారులు వారికి సహకరిస్తున్నారు అంతే. దీనితో అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ స్పష్టమైన వివరాలు అందడం లేదు. ఉన్న కొద్ది పాటి వివరాలతో మీడియాలో ఊహాజనిత కథనాలు ప్రసారం అవుతున్నాయి.

English summary
Contradiction between Dubai media and Indian media over Sridevi Death case. Different type of speculations going on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu