»   » ఐశ్వర్యరాయ్: అందగత్తే కాదు..అంతకు మించి వివాదాలు!

ఐశ్వర్యరాయ్: అందగత్తే కాదు..అంతకు మించి వివాదాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సినిమాలు, అవార్డులు, ఎండార్స్‌మెంట్లు, కుటుంబ విషయాలు...ఇలా ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు...ఐశ్వర్యరాయ్ చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి. ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న తర్వాత సినిమా రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో ఎత్తు పల్లాలు ఆమె జీవితంలో, కెరీర్లో ఎదురయ్యాయి.

ఫిల్మ్ ఇండస్టీలో ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదగడానికి ఆమె అందం, పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు....వివాదాలు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. కెరీర్ తొలినాళ్లలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌తో ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ శతృవులుగా మారి విడిపోయిన సందర్భం కూడా సెన్సేషన్.

మరో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌తో ఐశ్వర్యరాయ్ ఎఫైర్ గురించి సినీ జనాలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ మద్య శ్రీలంకకు చెందిన నిరోషన్ దేవప్రియా అనే వ్యక్తి ఐశ్వర్యరాయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఐశ్వర్యరాయ్‌తో సహజీవనం చేసానని, ఆమె నన్ను వదిలి అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని ఆరోపించారు.

ఇక ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా ఈ మధ్య చర్చనీయాంశం అయ్యాయి. ఐశ్వర్యకు, అత్త జయా బచ్చన్‌కు అస్సలు పడటం లేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భర్త అభిషేక్‌తో ఆమె విడాకులు తీసుకోబోతోందంటూ కూడా వార్తుల వినిపించాయి. ఇలా తరచూ ఏదో ఒక వార్తతో మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటున్నారు ఐష్. ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్‌ జీవితంలో చోటు చేసుకున్న పలు టాప్ వివాదాలపై ఓ లుక్కేద్దాం. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

ఐశ్వర్యరాయ్, మనీషా కొయిరాలా క్యాట్ ఫైట్

ఐశ్వర్యరాయ్, మనీషా కొయిరాలా క్యాట్ ఫైట్

మనీషా కొయిరాలా బాయ్ ఫ్రెండ్ రాజీవ్ ముల్‌చందానీ...ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌తో డేటింగ్ చేసాడు. ఈ విషయంలో ఐష్, మనీషా మధ్య క్యాట్ ఫైట్ జరిగింది. మీడియాలో అప్పట్లో ఇదో హాట్ టాపిక్.

ఐశ్వర్యరాయ్, సల్మాన్ బ్రేకప్

ఐశ్వర్యరాయ్, సల్మాన్ బ్రేకప్

‘హమ్ దిల్ దే చుకె సనమ్' షూటింగ్ సమయంలో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమాయణం మొదలైంది. ఆతర్వాత ఇద్దరూ విడిపోయారు. ఐశ్వర్యరాయ్ సల్మాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సల్మాన్ తనను శారీరకంగా హింసించాడని ఆమె ఆరోపించింది.

 శక్తికపూర్

శక్తికపూర్

ఓ స్టింగ్ ఆపరేషన్లో బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఐశ్వర్యరాయ్ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు. సుభాష్ గై చిత్రంలో చాన్స్ కోసం ఐశ్వర్యరాయ్ లైంగికంగా లొంగి పోయిందని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

షారుక్-ఐశ్వర్య ఫైట్

షారుక్-ఐశ్వర్య ఫైట్

షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘చల్తే చల్తే' సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్యరాయ్, షారుక్ మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ఐశ్వర్యను తొలగించి ఆ స్థానంలో రాణి ముఖర్జీని తీసుకున్నారు.

ఐశ్వర్యరాయ్, వివేక్ ఒబెరాయ్

ఐశ్వర్యరాయ్, వివేక్ ఒబెరాయ్

ఐశ్వర్యరాయ్, వివేక్ ఒబెరాయ్ డేటింగ్ చేస్తున్న సమయంలో... సల్మాన్ ఖాన్ నుండి తనకు 41 మిస్డ్ కాల్స్ వచ్చాయని వివేక్ ఒబెరాయ్ మీడియా ముఖంగా ప్రకటించాడు. అయితే వివేక్ ఒబెరాయ్ అలా ప్రకటించడాన్ని ఐశ్వర్యరాయ్ తప్పుబట్టింది.

ఐశ్వర్యరాయ్ కిస్ సీన్‌పై కుటుంబం అభ్యంతరం

ఐశ్వర్యరాయ్ కిస్ సీన్‌పై కుటుంబం అభ్యంతరం

ధూమ్ 2 చిత్రంలో ఐశ్వర్యరాయ్, హృతిక్ రోషన్ మధ్య హాట్ హాట్ కిస్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలయ్యే నాటికి ఐశ్వర్య-అభిషేక్ పెళ్లి ఫిక్సయింది. దీంతో ఈ ముద్దు సీన్‌పై బచ్చన్ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

చెత్త చెత్త వార్తలు

చెత్త చెత్త వార్తలు

ఒకానొక సందర్భంలో ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్‌లపై కొన్ని చెత్త చెత్త రూమర్లు, వినడానికి ఇబ్బందిగా అనిపించే పుకార్లు వినిపించాయి.

లావయిందనే విమర్శలు

లావయిందనే విమర్శలు

బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరానికి ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌కు హాజరయ్యారు. బిడ్డపుట్టి సంవత్సరమైనా బరువు తగ్గకుండా ఉండటంతో ఐశ్వర్యరాయ్‌పై విమర్శలు వచ్చాయి.

సోనమ్ కపూర్, ఐశ్వర్యరాయ్ మధ్య ఫైట్

సోనమ్ కపూర్, ఐశ్వర్యరాయ్ మధ్య ఫైట్

ఎల్ ఓరియల్ అనే సౌందర్య సాధనాల తయారీ సంస్థకు ఐశ్వర్యరాయ్ ఎప్పటి నుండో బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుర్ర హీరోయిన్ సోనమ్ కపూర్‌ను కూడా ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. అయితే సోనమ్ కపూర్ ఐశ్వర్యను ఆంటీ అని పిలవడం వివాదాస్పదం అయింది.

సర్జరీలు

సర్జరీలు

పెళ్లయి తల్లయిన తర్వాత ఐశ్వర్యరాయ్ బాగా లావెక్కి అందాన్ని కాల్పోయింది. ఆ సమయంలో ఆమె అతితక్కువ కాలంలోనే మళ్లీ మామూలు స్థాయికి చేరి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శనం ఇవ్వడంతో ఆమె తన ముఖానికి సర్జరీలు చేయించుకుందనే వార్తలు మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.

పనామా లీక్

పనామా లీక్

విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిలో ఐశ్వర్యరాయ్ కూడా ఉన్నట్లు ఇటీవల పనామా లీక్స్ ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Bollywood actress Aishwarya Rai has been the talk of the town ever since she walked down the red carpet of Cannes in a stunning gold outfit. She was literally glittering in gold. All these years she had been constantly criticized over her fashion sense and her weight gain etc. But this year's appearance left everyone amazed by her beauty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu