twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంటరైన రోజా.. విపత్కర పరిస్థితుల్లో జబర్దస్త్ జడ్జ్ గొప్పమనసు.. జోలెపట్టి మరీ అందరి ముందుకు!

    |

    కరోనా విజృంభణ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోవడం కలవరపెడుతోంది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన భారత ప్రభుత్వం దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించింది. ఎక్కడికక్కడ అన్ని రంగాలు మూతపడటంతో శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముందుకొచ్చిన రోజా గొప్ప మనసు చాటుకుంది. వివరాల్లోకి పోతే..

    కరోనా కల్లోలం.. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం

    కరోనా కల్లోలం.. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం

    చైనాలో పుట్టి మన దేశానికి వచ్చిన కరోనా వైరస్ కోరలు చాస్తూ దేశ ప్రజలను వణికిస్తోంది. ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటూ వీర విజృంభణ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అన్నిరంగాలు మూతపడ్డాయి. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది.

    అన్నీ బంద్.. రోజువారి కూలీల దుస్థితి

    అన్నీ బంద్.. రోజువారి కూలీల దుస్థితి

    షూటింగ్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇలా అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఎక్కడికక్కడ దుకాణాలు క్లోజ్ చేయడంతో రోజూవారి కూలీలు డబ్బుల్లేక అల్లాడిపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ జీవులు ఖాళీ జేబులతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు.

    సినీ కార్మికుల ఆకలి తీర్చేందుకు రోజా స్టెప్..

    సినీ కార్మికుల ఆకలి తీర్చేందుకు రోజా స్టెప్..

    ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఓ వైపు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు సినీ తారలు తమ తమ ఆర్ధిక సాయం అందిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ నటి, ఎమ్మెల్యే రోజా నిరుపేద సినిమా కార్మికుల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది.

     జోలె పట్టి విరాళాలు సేకరించే ఆలోచనలో రోజా

    జోలె పట్టి విరాళాలు సేకరించే ఆలోచనలో రోజా

    ఈ మేరకు తనవంతుగా 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ఇచ్చింది రోజా. అంతేకాదు త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పేద కళాకారులతో పాటు పేద ప్రజలను ఆదుకునేందుకు రోజా సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకుల వద్ద జోలె పట్టి విరాళాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Senior Hero Challenges MLA Roja Husband || Filmibeat Telugu
    ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ పెద్దలంతా..

    ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ పెద్దలంతా..

    ఓ సినీ నటిగా సినీ కార్మికుల బాగుకోరుకుంటున్న రోజాను చూసి భేష్ అంటున్నారు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ పెద్దలంతా రోజాలాగానే ముందుకొచ్చి సాయం చేస్తే సినీ కార్మికులు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు.

    English summary
    Dusring Corona effect all the industries are shutdown. In cine industry so many daily wagers suffering with money problem. Now Roja get into take step and helping them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X