Omicron యూఎస్, యూకేలో భారీగా విజృంభణ.. RRR, రాధేశ్యామ్ రిలీజ్ పరిస్థితి ఏమిటంటే?
కరోనావైరస్‌కు సంబంధించిన కొత్త వేరియెంట్ ఒమ్రికాన్ పలు దేశాల్లోనే కాకుండా ఇండియాలోని పలు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలు రాష్ట్రాల్లో కిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించడానికి ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ప్యాన్ ఇండియా సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితి సినీ దర్శక, నిర్మాతలకు ఓ సవాల్‌గా మారింది. ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

యూఎస్, యూకేలో రికార్డు కేసులు
అమెరికాలో కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒకే రోజులు సుమారు 550 కేసులు నమోదయ్యాయి. యూకేలో 1.30 లక్షలు, ఫ్రాన్స్‌లో 1.80 లక్షలు, పోర్చుగల్ 17 వేలు, గ్రీస్ 21 వేల కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు థియేటర్లను మూసివేయడం లేదా 50 శాతం అక్యుపెన్సితో మూవీ ప్రదర్శనలు నిర్వహించాలనే ఆలోచనలలో అమెరికా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నది.

పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు
ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా పాక్షిక లాక్‌డౌన్, కర్ఫ్యూలతో ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి. ఢిల్లీలో థియేటర్లు, మాల్స్, స్కూల్స్, వాణిజ్య సముదాయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకొన్నది. అలాగే కర్ణాటకలో కూడా కర్ఫ్యూ ల్లాంటి అంక్షలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతుండటంతో పాక్షికంగా లాక్‌డౌన్‌కు ప్రభుత్వాలు సమాయత్తం అవున్నాయి.

జెర్సీ సినిమా వాయిదా
దేశంలో కరోనావైరస్ పరిస్థితులు విజృంభించడంతో బాలీవుడ్ చిత్రం జెర్సీ సినిమాను వాయిదా వేసుకొన్నారు. డిసెంబర్ 31న రిలీజ్‌కు సిద్దమైన ఈ చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. దీంతో పలు బాలీవుడ్ చిత్రాలు కూడా రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నాయి అని తెలిసింది.

RRR, రాధే శ్యామ్ వాయిదా
ఇదిలా ఉండగా, తెలుగు దర్శక, నిర్మాతలు రూపొందించిన రెండు ప్యాన్ ఇండియా సినిమాలు RRR, రాధేశ్యామ్ చిత్రాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి మొదటి, రెండో వారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు భారీ మార్కెట్‌గా నిలిచిన నార్త్‌లో, యూఎస్‌లో పరిస్థితుల ప్రతికూలంగా ఉండటంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలను వాయిదా వేసే అవకాశం ఉందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కరోనాను ఎదిరించనున్న RRR, రాధేశ్యామ్
అయితే RRR, రాధేశ్యామ్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితి లేదని ఆ సినిమా నిర్మాత, దర్శకులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ముందుగా ప్రకటించిన డేట్స్‌లోనే రాధేశ్యామ్, RRR సినిమాలు వస్తున్నాయి. రిలీజ్ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమాలను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేపడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











