twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్.. జానీ మాస్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. కేసులు, కోర్టు తీర్పు వివరాలు ఇవే!

    |

    Recommended Video

    Choreographer Jani Master Sentenced To 6 Months In Jail | Filmibeat Telugu

    జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో జానీ మాస్టర్ దిట్ట. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక పలు చిత్ర పరిశ్రమల్లో జానీ మాస్టర్ అగ్ర హీరోలతో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ కు మేడ్చల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

    చెక్ బౌన్స్ కేసు

    చెక్ బౌన్స్ కేసు

    2015కి చెక్ బౌన్స్ అయిన వివాదంలో జానీ మాస్టర్ పై చీటింగ్ కేసు నమోదైంది. జానీ మాస్టర్ పై 2015లో సెక్షన్ 354, 324, 506 కింద కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విషయంలో కోర్టు ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడించింది. జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. చెక్ బౌన్స్ కేసుతో పాటు, మరిన్ని చీటింగ్ వ్యవహారాల్లో జానీ మాస్టర్ ని కోర్టు నిందితుడిగా ప్రకటించింది.

    ఆ కేసుని కొట్టివేస్తూ

    ఆ కేసుని కొట్టివేస్తూ

    జానీ మాస్టర్ పై నమోదైన కేసులపై గత నాలుగు ఏళ్లుగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం సెక్షన్ 354 కేసులో వాస్తవం లేదని కొట్టివేసింది. మిగిలిన 324, 506 సెక్షన్స్ కింద నమోదైన కేసులు నిజమే అని నిర్ధారిస్తూ శిక్ష విధించింది. జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి కూడా మేడ్చల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

    అలాంటి సందర్భంలో మాత్రమే

    అలాంటి సందర్భంలో మాత్రమే

    ప్రమాదకర ఆయుధాలు ఉపయోగించినప్పుడు, గాయపరిచినప్పుడు, హత్యాయత్నం చేసినప్పుడు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. జానీ మాస్టర్ అలాంటి పనులేవీ చేయలేదని కోర్టు నిర్ధారించడంతో ఆ సెక్షన్ కింద నమోదైన కేసుని కొట్టివేసింది. కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. ఆయన బెయిలు దరఖాస్తు చేసుకుంటారా అనే విషయం ఇంకా తెలియలేదు.

    స్టార్ కొరియోగ్రాఫర్

    స్టార్ కొరియోగ్రాఫర్

    జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా అనేక సూపర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్రఫీ అందించారు. చాలా మంది హీరోలు, అభిమానులు జానీ మాస్టర్ కొరియోగ్రఫీని ఇష్టపడతారు. 2009లో టాలీవుడ్ లో అడుగు పెట్టిన జానీ మాస్టర్ ఎన్టీఆర్, రాంచరణ్, బాలయ్య, అల్లు అర్జున్, చిరంజీవి, రవితేజ, ప్రభాస్ లాంటి హీరోలందరికీ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు.

    English summary
    court judgement 6 months jailed for Jani Master
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X