»   » హీరో,హీరోయిన్,దర్శకుడు లపై పోలీస్ కేసుకి కోర్టు

హీరో,హీరోయిన్,దర్శకుడు లపై పోలీస్ కేసుకి కోర్టు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా నిర్మిస్తున్న 'రామ్‌లీలా' సినిమాను నిషేధించాలని కోరుతూ జైపూర్ (రాజస్థాన్)కు చెందిన పవన్ శర్మ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ ఫిర్యాదుపై జైపూర్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ స్పందిస్తూ, వెంటనే కేసు నమోదు చేయాలంటూ పోలీసుల్ని ఆదేశించారు. దీంతో 'రామ్‌లీలా' దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, హీరో రణ్‌వీర్ సింగ్, హీరోయిన్ దీపికా పడుకునెలపై కేసు పెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  నవంబర్ 15న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారంలో ఉన్న 'ట్రైలర్లు' రెండు మతాల మధ్య విద్వేషాలు రగిలించే విధంగా ఉన్నాయని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రత్యేకించి ఓ మతస్థుల మనోభావాలు ఈ సినిమాల వల్ల దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేవారు. తన ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని పిటిషనర్ కోరడంతో ఈ కేసుపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) ఇవ్వాలని జైపూర్‌లోని శ్యామ్‌నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని మెజిస్ట్రేట్ ఆదేశించారు.

  Court orders FIR against Ramleela director, actors

  ఇక ఈ ఏడాది దీపికా పడుకోనే కెరీర్ యమ జోరు మీదుంది. వరుసగా 'యే జవానీ హై దీవానీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలతో ఇటు ప్రేక్షకుల్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించింది. అయితే ఆమె బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా బయటకు రాలేదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. రాబోతున్న 'రామ్ లీల' సినిమా రషెస్ చూసినవాళ్లు ఇప్పటివరకూ ఆమె అత్యుత్తమ అభినయం ఆ సినిమాలో ఉందని చెబుతున్నారు. "సంజయ్‌లీలా భన్సాలీ 'దేవదాస్'ని మించి ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. దాంతో పాటు భారతదేశపు గొప్ప నటీమణుల సరసన దీపిక చేరుతుంది'' అని ఆ సినిమా యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

  'రేస్ 2'తో కలుపుకుని 2013లో మూడు బ్లాక్‌బస్టర్‌లు తన ఖాతాలో వేసుకుంది దీపిక. 'రామ్‌లీల'తో ఆ సంఖ్య నాలుగుకు పెరుగుతుందని ఆమె అభిమానులు నమ్ముతున్నారు. అనేక కారణాల వల్ల దీపిక కెరీర్‌ను 'రామ్ లీల' మార్చివేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె స్వతంత్ర మనస్తత్వం ఉన్న నిర్భయస్తురాలైన గుజరాతీ యువతి లీలగా కనిపించనుంది. దీపికను దృష్టిలో ఉంచుకునే ఆ పాత్రను మలిచారు. ఆ పాత్రలోని భావోద్వేగాల్ని దీపిక ప్రతిభావంతంగా ప్రదర్శించిందని చెబుతున్నారు. విజువల్‌గా గొప్పగా ఉండే ఈ చిత్రంలో సంభాషణలకూ ప్రాధాన్యం ఉంది. భన్సాలీ సినిమా అంటేనే కథలో హీరోయిన్స్ కు తగినంత ఇంపార్టెన్స్ ఉంటుంది.

  English summary
  
 Last week, filmmaker Sanjay Leela Bhansali released the official trailer of his much anticipated film, Ramleela. The trailer that got rave reviews from critics, has now stirred up a controversy for allegedly ‘hurting religious sentiments’. Jaipur court directed the police to register a case against the filmmaker along with actors Ranveer Singh and Deepika Padukone for turning different groups against each other on religious grounds. Advocate Pawan Sharma has filed a complaint against the film, in the court of the additional chief metropolitan magistrate. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more