»   » జియాఖాన్ తల్లి పిటిషన్‌, నో చెప్పిన కోర్టు

జియాఖాన్ తల్లి పిటిషన్‌, నో చెప్పిన కోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jiah Khan
ముంబయి : జియాఖాన్ శవపరీక్ష వీడియో రిపోర్టును తమకు అందజేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ వేసిన పిటిషన్‌ను బొంబాయి స్థానిక కోర్టు తిరస్కరించింది. ప్రముఖ బాలీవుడ్ నటి జియాఖాన్ అనుమానాస్పద స్థితిలో జూన్ 3న మరణించిన విషయం విదితమే. ఆమె మరణానికి సంబంధించి పోలీసులు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు.

కానీ తదనంతరం బొంబాయి హై కోర్టు అతనికి బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జియా తల్లి తన కుమార్తె శవపరీక్ష వీడియో కావాలని పిటిషన్ దాఖలు చేశారు. "జియాఖాన్‌కు సంబంధించిన అటాప్సీ, టాక్సికాలజీ రిపోర్టును తమకు అందజేయాలని ఆమె తల్లి ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు తిరస్కరించింది. కానీ మేం ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదిస్తాం'' అని రబియా తరఫు న్యాయవాది దినేష్ తివారి అన్నారు.

బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ కేసు మళ్లీ చర్చనీయాంశం అయింది. తాజాగా విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆమె మరణం వెనక గల షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదిక ప్రకారం జియా ఖాన్ హత్యకు గురైనట్లు బలమైన ఆధారాలు లభించినట్లు స్పష్టమవుతోంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం, కలీనా ఫోరెన్సిక్ లాబోరేటరీ విడుదల చేసిన రిపోర్టుల్లో జియా ఖాన్ చేతివేళ్ల గోళ్ల కింద ఇతర వ్యక్తుల రక్తం, మాంసం అవశేషాలు లభించాయని తెలుస్తోంది. అదే విధంగా ఆమె బాడీలో కొంత ఆల్కహాల్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మద్యం తాగించడం వల్ల ఆమెను ఉరివేసి హత్య చేయడం సులభమవుతుందని ఆ రిపోర్టు సారాంశం. హత్య సమయంలో పెనుగులాట వల్ల ఆమె వేలి గోళ్లలోకి సదరు వ్యక్తుల రక్తం, మాంసం వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం జియా ఖాన్ తల్లి రబియా అమిన్ తన బిడ్డ హత్యకు గురైందని, విచారణ జరిపించాలని బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, నిందితుడు సూరజ్ పంచోలిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె తన పిటీషన్లో డిమాండ్ చేసింది. రబియా అమిన్ తన పిటీషన్లో ముఖ్యమైన విషయాలు పేర్కొంది. వాటిని పరిశీలిస్తే జియా ఖాన్ ఆత్యహత్య చేసుకోలేదని, హత్య చేయబడిందనే వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

English summary
A local court on Friday rejected an application filed by Jiah Khan's mother Rabiya Khan, seeking video recording of the late Bollywood actor's autopsy and the toxicology report. "The court has rejected our application but we will move higher courts," said advocate Dinesh Tiwari, Rabiya's lawyer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu