»   » సినిమా మళ్లీ ఆగింది: ఉదయ్ కిరణ్ ఆత్మ శాంతిస్తుందా?

సినిమా మళ్లీ ఆగింది: ఉదయ్ కిరణ్ ఆత్మ శాంతిస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటించారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు.

ఉదయ్ కిరణ్ నటించిన ఈ చివరి చిత్రం.... రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఉదయ్ కిరణ్ తొలి జయంతి రోజే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అప్పట్లో వీలు కాలేదు. తాజాగా జూన్ 26న ఉదయ్ కిరణ్ 2వ జయంతి సందర్భంగా ఆయన చివరి జ్ఞాపకం అయిన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Court stay on Uday Kiran movie

అయితే ఈ చిత్రం ఈ సారి కూడా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ చిత్రాన్ని ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆటంకాలు ఏర్పడటం వల్ల ఉదయ్ కిరణ్ ఆత్మ శాంతిస్తుందా? అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమాకు ఉదయ్ కిరణ్, మున్నా, స్క్రిప్ట్ రైటర్ నరేష్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్‌కి నివాళి ఇవ్వాలనుకున్నాం. ఆయన ఉన్నపుడు సినిమా విడుదలై ఉంటే మంచి హిట్టై ఉదయ్ కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చి ఉండేది. ఇపుడు తను మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు.

English summary
Hyderabad City Civil Court stay on Uday Kiran upcoming and last film Chitram Cheppina Katha.
Please Wait while comments are loading...