»   » హీరో రామ్ కు ఇది క్రేజీ రికార్డ్, రామజోగయ్యశాస్త్రి కి ధాంక్స్

హీరో రామ్ కు ఇది క్రేజీ రికార్డ్, రామజోగయ్యశాస్త్రి కి ధాంక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరో రామ్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అందుకు కారణం...ఆయన మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేయటమే. అదేమింటే...

ram

ఈ సంవత్సరంలో ప్రారంభంలో అంటే తొలిరోజే 'నేను శైలజ' అంటూ వచ్చి పలకరించిన రామ్ ...హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా ఎంత హిట్ అయ్యిందో అందులోని పాటలు కూడా అదే రీతితో అందరినీ ఆకట్టుకున్నాయి.

ram

ముఖ్యంగా 'క్రేజీ క్రేజీ ఫీలింగ్‌' పాటకు విపరీతమైన ఆదరణ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో పృథ్వీచంద్ర పాడిన ఈ పాటను యూట్యూబ్‌లో ఏకంగా కోటిమందికి పైగా చూసారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'క్రేజీ క్రేజీ' పాటకు కోటి వ్యూస్‌ రావడం సంతోషంగా ఉందన్నారు.'కొత్త ఏడాది రోజున విడుదలైన మా సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలవడం మా యూనిట్‌కు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అలరిస్తున్నాయి. ముఖ్యంగా రామజోగయ్యశాస్త్రి రాసిన 'క్రేజీ క్రేజీ' సాంగ్‌ బాగుంది. అందుకే ఈ పాటకు కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయి' అని నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ఆనందం వ్యక్తం చేశారు.


''యూట్యూబ్‌లో క్రేజీ ఫీలింగ్‌ పాటను కోటి మందికిపైగా చూడటం ఆనందంగా ఉంది. దేవిశ్రీప్రసాద్‌, రామజోగయ్యశాస్త్రికి థ్యాంక్స్‌' అని హీరో రామ్‌ ట్వీట్‌ చేశారు.

English summary
Ram's last movie Nenu Sailaja's 'Crazy Crazy' song was pick of the album for many and video of this track crossed 1 crore (10 million) plus views in single youtube channel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu