»   » సాయి ధరమ్ తేజ నెక్ట్స్ చిత్రానికి వెరైటీ టైటిల్

సాయి ధరమ్ తేజ నెక్ట్స్ చిత్రానికి వెరైటీ టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టైటిల్ లోనే వెరీటీని ప్రదర్శించి అక్కడ నుంచి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూంటారు మేకర్స్. తాజాగా అలాంటి ప్రయత్నమే సాయి ధరమ్ తేజ చిత్రానకి జరుగుతోంది. ఆయన తాజా చిత్రం కళ్యాణ్ రామ్ తో ఓం తీసిన సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం లాంచింగ్ ఈ రోజు జరిగింది. ఈ చిత్రానికి సంభందించి తిక్క అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. దానికి ట్యాగ్ లైన్ గా... ‘హ్యాండిల్ విత్ కేర్' అని పెడుతున్నట్లు తెలుస్తోంది.రోహిన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి నెంబర్ వన్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ టైటిల్ ని బట్టి ఇదో యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది. సినిమాలో ఎక్కువ భాగం శ్రీలంకలో షూటింగ్ జరగనుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని దర్శక,నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

ఇక...

Crazy title for Sai dharam tej’s next

ఆ మధ్యన ...'పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ పలకరించిన ...సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆగస్టు 28న ఈ చిత్రాన్ని విడుదల చేయన్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 24 కు తీసుకు వెళ్లినట్లు సమాచారం.

మహేష్ బాబు చిత్రం ఆగస్టు 7 న విడుదల అవుతోంది. ఆ తర్వాత కిక్ 2, రుద్రమదేవి లు వచ్చేదాకా కొత్త రిలీజ్ లు లేవు. అందుకే ఈ తేదిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

చిత్రం విశేషాలకు వెళ్తే...

సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేయనున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ని ఏప్రిల్ లో అమెరికాలో షూట్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Crazy title for Sai dharam tej’s next

''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. '' అని తెలిపారు. '''మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను.

అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.

సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

English summary
Sai Dharam Tej’s latest film in the direction of Suneel Reddy of Kalyanram’s OM 3D fame has been launched. The makers have zeroed in on Thikka as the title of the film.With the tagline ‘Handle with care’.
Please Wait while comments are loading...