»   » క్రికెట్ అభిమానులకు కేరింతలు కొట్టే సినిమా

క్రికెట్ అభిమానులకు కేరింతలు కొట్టే సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'చక్‌ దే ఇండియా', 'భాగ్‌ మిల్కా భాగ్‌' చిత్రాల విజయం బాలీవుడ్‌లో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలకు బాటలు వేసింది. తాజాగా ఈ కోవలోకి మరో చిత్రం చేరనుంది. కపిల్‌దేవ్‌ సారథ్యంలో 1983లో భారత్‌ క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకున్న క్షణాల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. సంజయ్‌ పురాన్‌ సింగ్‌ చౌహాన్‌ దర్శకుడు. 'లాహోర్‌' చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడీయన.

''భారతీయ క్రీడా చరిత్రలో చెరిగిపోని అధ్యాయం 1983 ప్రపంచ కప్‌ విజయం. ఇప్పటివరకూ దీనికి సంబంధించి ఎలాంటి సినిమా రాలేదు. కచ్చితంగా అందరికీ తెలియాల్సిన విషయమిది'' అన్నారు నిర్మాత విష్ణువర్థన్‌ ఇందూరి. సెలబ్రిటీ క్రికెట్‌లీగ్‌ స్థాపకుడీయన.

Cricket legends comes together in Sanjay Puran Singh’s next film

''1983 ప్రపంచ కప్‌లో ఆడిన క్రీడాకారులందరితోనూ మాట్లాడుతున్నాం. నటీనటుల ఎంపిక పూర్తిచేసి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం. 2015లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''ని చెప్పారు దర్శకుడు.

''క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు రావడం ఎంతో అవసరం. 1983 ప్రపంచ్‌ కప్‌ కథాంశంగా సినిమా తీయాలనుకోవడం మంచి పరిణామం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని కపిల్‌దేవ్‌ చెప్పారు.

English summary
Director Sanjay Puran Singh Chauhan, who last made Lahore (2010), is coming up with a film on India’s historic win at the Cricket World Cup in 1983.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu