For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుద్దితెచ్చుకుని మాట్లాడండి: హైపర్ ఆదిపై నిప్పులు చెరిగిన మహేష్ కత్తి

  |
  హైపర్ ఆదిపై ఫైర్ అయిన మహేష్ కత్తి

  జనాలు తిట్టుకుంటూ కూడా చూసే కామెడీ షో జబదస్థ్, ఈ మధ్యకాలంలో వచ్చిన రియాలిటీషోలన్నిటికీ ఇన్స్పిరేషన్ ఇదే అనటం లో సందేహం లేదు... అయితే ఈ షో మొదలైన దగ్గరినుంచీ రకరకాల వివాదాల్లో ఉన్న ఈ షో ఇంకా అదేరకంగా సాగుతూనేఉంది. ఆడవాళ్లని కించపరుస్తున్నారనే ఆరోపణలు మొదలు కులవివక్ష, కోర్టునే అపహాస్యం చేయటం లాంటి ఆరోపణలతో కేసులని కూడా ఎదుర్కుందీ షో...

  హైపర్ ఆది

  హైపర్ ఆది

  ఈ షో లో హైపర్ ఆది చేసే స్కిట్ లకి కాస్త ఫాలోయింగ్ ఎక్కువే, దాదాపు వాట్సాప్, ఫేస్బుక్లలో వచ్చే జోకులనే కాపీకొట్టి "పంచ్" లుగా వాడే ఆదీ స్కిట్స్లో గతం లోనే రామ్‌గోపాల్ వర్మ మీద కూడా సెటైర్లు వేసాడు... రాత్రి బోరుకొడితే ఓడ్కా బాటిల్ ఓపెన్ చేసి ట్విట్టర్ ఓపెన్ చేస్తాడంటూ ఇన్‌డైరెక్ట్ గా రామ్‌గోపాల్ వర్మ మీద వేసిన సెటైర్లకే ఆది మీద కొంత వ్యతిరేకత వచ్చింది జనాల్లో.

   మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ

  మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ

  మెగా ఫ్యామిలీకి ఎవరు ఆపోజిట్ లో ఉన్నా వాళ్ళే హైపర్ ఆది స్కిట్లో నెక్స్ట్ టార్గెట్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ దగ్గర్నుంచీ మహేష్ కత్తి ఎదుర్కుంటున్న సమస్యలు మనందరికీ తెలిసినవే అదే సమయం లో హైపర్ ఆది కూడా మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు.

   రివ్యూలు రాసినంత ఈజీ

  రివ్యూలు రాసినంత ఈజీ

  హైపర్ ఆది వేసిన సెటైర్లపై సినీ విమర్శకుడు కమ్ బిగ్ బాస్ ఫేం మహేశ్ కత్తి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఆది స్కిట్ లో భాగంగా పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ మాత్రం.. ముందు పొట్ట వేసుకొని వెనుక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ అంటూ పంచ్ లు వేసేశాడు.

  పొట్ట ఉందని.. బట్ట ఉందని..

  పొట్ట ఉందని.. బట్ట ఉందని..

  ఈ పంచ్ లు తనను ఉద్దేశించి ఉన్నాయంటూ కనెక్ట్ అయ్యాడ కత్తి. తనకు పొట్ట ఉందని.. బట్ట ఉందని.. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా? అంటూ క్వశ్చన్ వేయటమే కాదు.. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని.. ఆ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండటమే ప్రపంచమన్నారు.

  నా స్టైల్లో నేను ఉంటాను

  నా స్టైల్లో నేను ఉంటాను

  కాస్త భిన్నంగా ఉంటేనే జోర్స్ అయిపోతామా? అంటూ రియాక్ట్ అయిన మహేశ్.. ఒకరు పొడుగ్గా ఉండొచ్చని.. మరొకరు పొట్టిగా ఉండొచ్చని.. నా స్టైల్లో నేను ఉంటానని.. అంత మాత్రానికే అలా అనేస్తారా? అంటూ సోషల్ మీడియా లైవ్ ద్వారా హైపర్ ఆదిని ఏసుకున్నాడు.

  ఫ్రెండ్స్ పంపే లింక్స్

  ఫ్రెండ్స్ పంపే లింక్స్

  తాను జబర్దస్త్ షోను చూడనని.. కాకుంటే ఫ్రెండ్స్ పంపే లింక్స్ చూడటంతోనే తనకీ విషయాలు తెలిశాయన్నారు. జబర్దస్త్ గొప్ప షో అయినా.. అందులో గొప్ప కామెడీ ఉంటుందని తాను అనుకోననీ. మనుషుల మీదా..వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహాస్యం చేస్తున్న దానిని హాస్యంగా ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు.

  ఫేస్‌బుక్ లైవ్

  ఫేస్‌బుక్ లైవ్

  ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా కత్తి మహేశ్ బదులిస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉండటమే అతడికి మంచిదని సలహా ఇచ్చాడు. నేను ఇలా ఉండేందుకే ఇష్టపడతా. నా పొట్ట, నా బట్ట నాకు నిజంగా గర్వకారణం అని చెప్పాడు.

  కాస్త బుద్ది తెచ్చుకొని మాట్లాడండి

  పవన్‌ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అంటే.. అతడి వ్యక్తిగత విషయాలు, అపియరన్స్ గురించి మాట్లాడానా? కాస్త బుద్ది తెచ్చుకొని మాట్లాడండి. అంటూ ఘాటుగా విమర్శించాడు. చివరగా.. నీ షోను నువ్వు ఎంజాయ్ చేయ్. కానీ బాడీ షేమింగ్ గురించి తగ్గిస్తే మంచిది, నా బాడీ గురించి నేను హ్యాపీగా ఉన్నానని హైపర్ ఆదికి సలహా ఇచ్చాడు.

  English summary
  Tollywood Movie Critic Mahesh katti warned Hyper Aadi in Facebook live, About Jabardasth skit with aadi and team on mahesh katthi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X