twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనోజ్-సన్నీలియోన్ ‘కరెంట్ తీగ’ పెద్దలకు మాత్రమే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నిలియోన్ ప్రధాన పాత్రల్లో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ‘కరెంట్ తీగ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాలో యాక్షన్ కంటెంట్, రొమాన్స్ కంటెంట్ కాస్త ఎక్కుగా ఉండటంతో ఈచిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది.

    ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దీపావళి కానుకగా ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. సినిమా గురించి దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించి సూపర్‌హిట్‌గా నిలిచాయని, సన్నీలియోన్ అంటే కేవలం శృంగార నటి మాత్రమే కాదని, ఆమె ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించిందని, ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సూపర్‌హిట్ అవుతుందని చెప్పడంతో పూర్తి నమ్మకంతో ఉన్నామని తెలిపారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని 17కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు.

    Current Theega Gets ‘A’

    అచ్చు సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలు ఇప్పటికే ఆదరణ పొందుతున్నాయని, తమ ఇద్దరి కలయికలో ఈ చిత్రం హాట్రిక్‌గా నిలుస్తుందని కథానాయకుడు మనోజ్ తెలిపారు. ఉన్న పాటలన్నీ ఒక్కొక్కదానికి సంబంధం లేకుండా సంగీత దర్శకుడు అచ్చు తీర్చిదిద్దారని, కెమెరా పనితనం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారని, జగపతిబాబు ఈ సినిమాకు ఓ మూలస్తంభంలా ఉంటారని ఆయన వివరించారు.

    సంపూర్ణేష్‌బాబు, ఫిరోజ్ అబ్బాసి, గిరిబాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్, రఘుబాబు, జీవా, ఫిష్ వెంకట్, టార్జాన్, వెనె్నల కిశోర్, ధన్‌రాజ్, తా.రమేష్, సుప్రీత్, శివారెడ్డి, పృధ్వీ, సత్యకృష్ణ, కాదంబరి కిరణ్, గీతాంజలి, రవిశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:కిశోర్ తిరుమల, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, వరికుప్పల యాదగిరి, నిర్మాత:విష్ణు మంచు, దర్శకత్వం:జి.నాగేశ్వరరెడ్డి.

    English summary
    Current Theega completes Censor formalities and is certified “A”. Actor Manoj Manchu, who has carved a niche for himself in Telugu Film Industry with meaningful films, play the lead in Current Theega. He plays the role of a village ruffian. The film is a perfect mix of joy, fun, thrill and entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X