»   »  చిన్న చిన్న వేషాలే... రామానాయుడిని స్టార్ ప్రోడ్యూసర్‌ని చేశాయి

చిన్న చిన్న వేషాలే... రామానాయుడిని స్టార్ ప్రోడ్యూసర్‌ని చేశాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈరోజు 3.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. రామానాయుడిని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవడానికి ఆయనకు చాలా ప్రత్యేకతలున్నాయి.

రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. సురేష్ ప్రొడక్షన్స్ లోగో 'ఎస్‌పీ'కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ భాషల్లో 135కు పైగా చిత్రాలు నిర్మించారు. చాలా మంది ప్రముఖులు ఈ బ్యానర్లో నటించారు. రామానాయుడు తాను నిర్మించిన చాలా చిత్రాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రల్లో ఆయన కాసేపు సినిమాల్లో కనిపించేవారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, జడ్జి వంటి పాత్రలను పోషించారు.

సినిమా రంగంలో స్టూడియోలను నెలకొల్పిన అతికొద్దిమంది ప్రముఖుల్లో దగ్గుబాటి రామానాయుడు ఒకరు. విశాఖపట్నంలో స్టూడియో ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి రామానాయుడు కావడం విశేషం. 1991లో రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌ను నెలకొల్పారు.

D Ramanaidu, a filmmaker par excellence

గ్రామీణ యువతలో నైపుణ్యం పెంచేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ఇందుకోసం గాను మెదక్ జిల్లా తునికి గ్రామంలో 33 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. రామానాయుడు తీసిన బెంగాలీ చిత్రం 'అసుఖ్‌' జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డు గెలుచుకుంది. దక్షిణాది చిత్ర ప్రముఖునిగా ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది.

ప్రముఖ నటుడు వెంకటేష్, నిర్మాత రామానాయుడు కుమారుడు. ప్రఖ్యాత నిర్మాత సురేష్ ఆయన పెద్ద కుమారుడు. యువ నటులు రానా, నాగ చైతన్యలు... రామానాయుడికి మనవళ్లు. ఆయన కన్నుమూశారన్న వార్త తెలిసి షాక్‌కుగురైన పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుంటున్నారు.

English summary
Multilingual Indian film producer, Daggubati Ramanaidu passed away today in Hyderabad after a long battle with cancer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu