»   » మూడో ఎన్టీఆర్...‘దాన వీర సూర కర్ణ’ (వర్కింగ్ స్టిల్స్)

మూడో ఎన్టీఆర్...‘దాన వీర సూర కర్ణ’ (వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో తెరకెక్కబోతున్న చిత్రం ‘దాన వీర శూర కర్ణ'. జే.వి.ఆర్ దర్శకుడు. సి.హెచ్ వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. ఈ సినిమాలో స్వర్గీయ నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ నందమూరి తారక రామారావు, సౌమిత్రి కూడా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్‌ల చేతుల మీదుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. తొలి సన్నివేశానికి జూ ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగటా, కళ్యాణ్ రామ్ కెమెరా స్విచాన్ చేసారు. హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్...

దాన వీర శూర కర్ణ

దాన వీర శూర కర్ణ

ఒకప్పుడు ‘దాన వీర శూర కర్ణ' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరు పోగొట్టుకండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తామన్నారు నిర్మాత బాలరాజు.

సరికొత్త టెక్నాలజీ

సరికొత్త టెక్నాలజీ

మా దర్శకుడు బాగా తీస్తారనే నమ్మకం ఉంది. కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. చిన్న పిల్లలతో సినిమా కాబట్టి త్వరగా పూర్తి చేయాలని కంగారు పడకుండా కాస్త టైమ్ తీసుకుని అతి జాగ్రత్తగా చిత్రీకరణ చేస్తాం అని తెలిపారు నిర్మాత.

విడుదల తేదీ

విడుదల తేదీ

90 రోజుల సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. అన్న ఎన్టీఆర్ జన్మదినాన మే 28న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బాలరాజు తెలిపారు.

కృష్ణుడు, వసుదేవుడి పాత్రలు

కృష్ణుడు, వసుదేవుడి పాత్రలు

స్వర్గీయ జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో నటిస్తుండగా, సహదేవుడిగా-కుచేలుడిగా మరో తనయుడు సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, నిర్మాణ నిర్వహణ: కాజ సూర్యనారాయణ, సమర్పణ: జగపతి మూవీ క్రియేషన్స్, నిర్మాతలు : సిహెచ్.వెంకటేశ్వరరావు, జె బాలరాజు, రచన-దర్శకత్వం: జె.వి.ఆర్.

English summary
Check out Daana Veera Soora Karna movie details and working stills.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu