»   » మూడో ఎన్టీఆర్ నటిస్తున్న ‘దాన వీర సూర కర్ణ’ ఆడియో డీటేల్స్

మూడో ఎన్టీఆర్ నటిస్తున్న ‘దాన వీర సూర కర్ణ’ ఆడియో డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో తెరకెక్కబోతున్న చిత్రం ‘దాన వీర శూర కర్ణ'. జే.వి.ఆర్ దర్శకుడు. సి.హెచ్ వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. ఈ సినిమాలో స్వర్గీయ నందమూరి జానకీరామ్ కుమారులు మాస్టర్ తారక రామారావు, సౌమిత్రి కూడా నటిస్తున్నారు.

ఈ సంవత్సరం జనవరిలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6వ తేదీన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ, పలువురు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఆడియో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Daana Veera Sura Karna audio launch date

ఒకప్పుడు ‘దాన వీర శూర కర్ణ' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరు పోగొట్టుకండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించామని చెబుతున్నారు. నిర్మాత బాలరాజు. మా దర్శకుడు బాగా తీసారు. కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. చిన్న పిల్లలతో సినిమా కాబట్టి త్వరగా పూర్తి చేయాలని కంగారు పడకుండా కాస్త టైమ్ తీసుకుని అతి జాగ్రత్తగా చిత్రీకరణ చేసాం అని తెలిపారు నిర్మాత.

90 రోజుల సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేసారు. అన్న ఎన్టీఆర్ జన్మదినాన మే 28న సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. స్వర్గీయ జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో నటిస్తుండగా, సహదేవుడిగా-కుచేలుడిగా మరో తనయుడు సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, నిర్మాణ నిర్వహణ: కాజ సూర్యనారాయణ, సమర్పణ: జగపతి మూవీ క్రియేషన్స్, నిర్మాతలు : సిహెచ్.వెంకటేశ్వరరావు, జె బాలరాజు, రచన-దర్శకత్వం: జె.వి.ఆర్.

English summary
Latest report is that the audio of ‘Daana Veera Sura Karna’ will be graced by Junior NTR, Nandamuri Hari Krishna and Kalyan Ram on May 6th
Please Wait while comments are loading...