»   » తండ్రిగా బాలకృష్ణ...తన పిల్లలతో (చూడని ఫొటోలు)

తండ్రిగా బాలకృష్ణ...తన పిల్లలతో (చూడని ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఉగ్ర నరసింహుడులా ...బాలకృష్ణ తెరమీద నటనతో వీరావేశంతో ఊగిపోయే ఆయన తన కుటుంబంతో ఎలా గడుపుతూంటారు. ఇదిగా ఇలా హ్యాపీగా బాలయ్య తన పిల్లతో గడిపేవారు. వారికి తండ్రిగా చాలా సరదాగా కాలం గడిపేవారు. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త చిత్రం షూటింగ్ కు సిద్దమవుతున్నారు. గాడ్సే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

'కొందరు కొడితే ఎక్స్‌రేలో కనిపిస్తుంది. కొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది. నేను కొడితే హిస్టరీలో వినిపిస్తుంది...'. - కొత్త సినిమా కోసం బాలకృష్ణ పలికిన సంభాషణ ఇది. బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది సంభాషణలే. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట తూటాలా దూసుకుపోతుంది. తాజాగా మరోసారి అలాంటి పదునైన సంభాషణ పలికారాయన. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష హీరోయిన్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

దర్శకుడు మాట్లాడుతూ.... ''బాలకృష్ణగారి కోసం మూడేళ్ల కిందటే తయారు చేసుకొన్న కథ ఇది. యాక్షన్‌, వినోదంతో పాటు కుటుంబ అనుబంధాలకూ చోటుంది. తుపాకీ నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌లా బాలకృష్ణ పాత్ర ఉంటుంది. తను అనుకొన్న లక్ష్యాన్ని సాధించేవరకు వెనుదిరిగి చూడని వ్యక్తిగా కనిపిస్తారు. పాత్రలో రకరకాల కోణాలుంటాయి. అవన్నీ అభిమానులకు నచ్చుతాయి. 'లెజెండ్‌'లాంటి చిత్రం తర్వాత మా కథపై నమ్మకంతో అవకాశాన్నిచ్చారు బాలకృష్ణ. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్రాన్ని తీర్చిదిద్దుతాం'' అన్నారు దర్శకుడు.

Dad Balakrishna with his Kids!

నిర్మాత మాట్లాడుతూ... ''బాలకృష్ణతో మాత్రమే తీయదగిన కథ ఇది. ఆయన విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. అభిమానులకు ఏమేం కావాలో అవన్నీ ఇందులో ఉంటాయి. త్రిష, ప్రకాష్‌రాజ్‌, అలీ పాత్రలకూ ప్రాధాన్యముంది. ఈ నెల మూడో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము''అన్నారు నిర్మాత.

ఈ చిత్రంలో జయసుధ, గీత, చంద్రమోహన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత

English summary
Nandamuri Balakrishna was seen spending time with his daughter Brahmani, Tejaswi and Mokshagna in this fashion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu