Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Dada Saheb Phalke Awards 2020: తెలుగు అవార్డుల ప్రకటన.. చిన్న హీరో అరుదైన ఘనత
ఇండియాలోనే మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా పిలుచుకుంటారు. ఈయన పేరు మీద ప్రతి ఏడాది అవార్డులను ప్రకటిస్తున్నారు. కొన్నేళ్లుగా అన్ని భాషల్లోనూ ఈ పేరుతో అవార్డులు ప్రధానం చేస్తున్నారు. అత్యత్తమ ప్రదర్శనను కనబరిచిన నటీనటులకు.. తమ తమ విభాగాల్లో రాణించిన టెక్నీషియన్లకు.. ప్రేక్షకులను అలరించిన చిత్రాలకూ ఈ అవార్డులు ఇస్తుంటారు. అలాగే, సినీ రంగంలో సుదీర్ఘ కాలంగా సేవలు చేస్తున్న వ్యక్తులకూ జీవిత సాఫల్య పురస్కారాలు అందిస్తుంటారు. ఇక, ఈ ఏడాదికి సంబంధించిన అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు విభాగంలో చిన్న హీరో అరుదైన ఘనతను సాధించాడు. ఆ వివరాలు మీకోసం!

దక్షిణాది భాషలకు అవార్డుల ప్రకటన
జనవరి 1న దాదా సాహెబ్ ఫాల్కే రీజినల్ అవార్డులను ప్రకటించారు. తమిళంలో ధనుష్, జ్యోతిక ఉత్తమ నటీనటులుగా.. కన్నడంలో రక్షిత్ శెట్టి ఉత్తమ హీరోగా, తన్య హోప్ ఉత్తమ నటిగా.. మలయాళంలో సూరజ్, పార్వతి హీరో హీరోయిన్ల విభాగంలో ఎంపికయ్యారు. అలాగే, ఉత్తమ చిత్రం, మ్యూజిక్ డైరెక్టర్, విలక్షణ నటుడు తదితర విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించారు.

నాని సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డు
నేచురల్ స్టార్ నాని - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జెర్సీ'. క్రికెట్ నేపథ్యంతో సాగిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అందుకే దీన్ని హిందీలోనూ రూపొందిస్తున్నారు. ఇక, తాజాగా ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే తెలుగు సినిమా అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది జెర్సీ. దీనిపై యూనిట్ ఖుషీగా ఉంది.

ఉత్తమ నటిగా కన్నడ భామ రష్మిక
‘ఛలో' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. అప్పటి నుంచి వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది కన్నడ భామ రష్మిక మందన్నా. ఈమె దాదా సాహెబ్ ఫాల్కే తెలుగు సినిమా అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్'లో అత్యుత్తమ నటనను కనబరిచిన కారణంగానే ఆమెకు ఈ అవార్డు లభించింది.

చిన్న హీరోకు అత్యుత్తమ పురస్కారం
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. స్వరూప్ తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక, ఇందులో డిటెక్టివ్‌గా అత్యుత్తమ నటనను కనబరిచిన నవీన్ దాదా సాహెబ్ ఫాల్కే తెలుగు సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ఎస్ థమన్
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూ సత్తా చాటుతున్నాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. బ్యాగ్రౌండ్ స్కోర్, చక్కని పాటలతో ఆకట్టుకుంటున్న అతడు.. తాజాగా ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే తెలుగు సినిమా అవార్డుల్లో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. గత ఏడాది థమన్ పేరిట ఎన్నో రికార్డులు బద్దలైన విషయం తెలిసిందే.

విలక్షణ నటుడిగా ఎంపికైన నాగార్జున
దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. హ్యాండ్సమ్ లుక్స్‌తో పాటు నటనలోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారాయన. ఈ క్రమంలోనే కుర్రాళ్లు పోటీగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదా సాహెబ్ ఫాల్కే తెలుగు సినిమా అవార్డుల్లో నాగార్జున ఉత్తమ విలక్షణ నటుడిగా ఎంపిక అయ్యారు.

విమర్శలకు చెక్ పెడుతూ ఆ డైరెక్టర్
2019లో వచ్చిన చిత్రాల్లో ‘సాహో' ఒకటి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను సుజిత్ తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా హిందీలో మినహా అన్ని భాషల్లోనూ నిరాశ పరిచింది. దీంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సుజిత్ దాదా సాహెబ్ ఫాల్కే సినిమా అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా సెలెక్ట్ అయ్యాడు.