»   » తెలుసా? తెలుగు షార్ట్ పిలింకు దాదా ఫాల్కే అవార్డు

తెలుసా? తెలుగు షార్ట్ పిలింకు దాదా ఫాల్కే అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన దాదాఫాల్కే అవార్డులు కొద్ది రోజుల క్రితం మనోజ్ కుమార్ కుమార్ కు రావటం అందరం మాట్లాడుకున్నాం. అయితే దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016 లో ఓ తెలుగు షార్ట్ ఫిలిం అఫీషియల్ గా సెలక్ట్ అయ్యిందనే విషయం మీకు తెలుసా. ఆ వివరాలు మీకు అందిస్తున్నాం.

ప్రముఖ తెలుగు సినీ ఫొటో గ్రాఫర్ వైయస్ ఎన్ మూర్తి డైరక్ట్ చేసిన 30 నిముషాల శ్వాస (THE BREATH)కు ఈ ఫెస్టివల్ లో బెస్ట్ డైరక్టర్ 2016 అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ ని ఆయన 30,మే 2016న అందుకున్నారు.

Dada Saheb Phalke Best Director Award to a Short film

ఇంతకీ ఈ షార్ట్ ఫిలిం దేని గురించి అంటే... తెలంగాణ ఉద్యమ నేపధ్యం లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మించబడిన చిత్రం ఇది. 1960 లో మొదలు ఐన ఈ ఉద్యమం గత 15 సంవత్సరాలలో తీవ్ర రూపం దాల్చింది.

Dada Saheb Phalke Best Director Award to a Short film

సూర్య అనే మధ్య తరగతి కి చెందిన కాలేజీ స్టూడెంట్, తెలంగాణ రాష్ట్రం సాధించాలి అనే సంకల్పం తో, ఒక ఆలోచనకి వచ్చాడు. అతను తీసుకున్న ఆ బలమైన నిర్ణయం, దాని వల్ల జరిగిన అనూహ్య పరిణామాలు, ఆధారంగా రూపు దిద్దుకున్నసున్నితమైన చిత్రం ఇది.

English summary
Renowned Fashion and Celebrity photographer Murthy YSN Directed a 30 minute film named THE BREATH ( SWASA ) that won the countries most prestigious Dada Saheb Phalke Film Festival's Best Director Award for 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu