Don't Miss!
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
జూ. ఎన్టీఆర్‌కు ఉచిత సలహాలు ఇవ్వను.. లక్ష్మీపార్వతిని నేను కొట్టలేదు!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. తరచుగా జూ. ఎన్టీఆర్ కేంద్రంగా అనేక రాజకీయ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడని చాలామంది భావిస్తున్నారు. ఇదే ప్రశ్న బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరికి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. పురందేశ్వరి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పురంధేశ్వరే భవిష్యత్తులో ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఓ చర్చ జరుగుతోంది.

జూ. ఎన్టీఆర్‌తో మాట్లాడలేదు
తాను ఇంతవరకు జూ. ఎన్టీఆర్ తో రాజకీయ పరమైన విషయాలు మాట్లాడలేదు అని పురందేశ్వరి అన్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. తనకు చిత్ర పరిశ్రమలో చాలా భవిష్యత్తు ఉందని, సినిమాల్లోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో ఎన్టీఆరే స్వయంగా తెలిపాడని పురందేశ్వరి అన్నారు.

అంతటి గౌరవం ఇస్తే
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అతడికి దిశా నిర్దేశం చేసే వ్యక్తిగా పురంధేశ్వరే ఉంటారనే ప్రచారం జరుగుతున్నట్లు ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. అంతటి గౌరవం ఇస్తే స్వాగతిస్తా. అన్ని విషయాల్ని విడమర్చి చెప్పడం భాద్యతగా భావిస్తా. అడగకుండా మాత్రం ఉచిత సలహాలు ఇవ్వనని పురందేశ్వరి అన్నారు. తాను ఏదైనా విషయాన్ని చెబితే జూ ఎన్టీఆర్ దానిని గౌరవిస్తాడని పురందేశ్వరి అన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ గురించి
బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి కూడా పురందేశ్వరి స్పందించాడు. చిన్న నాటి నుంచి నాన్నగారు ఎన్నో కష్ఠాలు, ఒడిదుడుకుల ఎదుర్కొని చలనచిత్ర రంగంలో స్టార్ గా ఎదిగారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలని, ఇబ్బందులని పూర్తిగా చూపించి ఉండాల్సింది. బయోపిక్ చిత్రం అంటే వారు ఎదుర్కొన్న కష్టాలు కూడా చూపించాలి అని పురందేశ్వరి అన్నారు.

లక్ష్మీ పార్వతిని నేను కొట్టలేదు
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కంటే మంచి విజయం సాధించడంపై పురందేశ్వరి స్పందించారు. జనాలు ఎప్పుడూ సంచలనాలకే పెద్ద పీట వేస్తారు అని అన్నారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తాను లక్ష్మీ పార్వతిని కొట్టినట్లు చూపించిన సన్నివేశాల్లో ఏమాత్రం వాస్తవం లేదని పురందేశ్వరి అన్నారు. అలాంటి సంఘటనలేవీ నిజజీవితంలో జరగలేదని అన్నారు.