»   » బ్రహ్మచర్యం పోయేలా చూడు తల్లో.. జాక్వలైన్‌కు పూజలు.. ఢిల్లీ విద్యార్థుల వింత ఆచారం

బ్రహ్మచర్యం పోయేలా చూడు తల్లో.. జాక్వలైన్‌కు పూజలు.. ఢిల్లీ విద్యార్థుల వింత ఆచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Valentine's Day : Jacqueline as Damdami Mai, Ranveer Singh as Love Guru

ప్రేమికుల దినోత్సవం నాడు ప్రతీ జంట ఏదో రకంగా తమ ప్రేమను వ్యక్తం చేసుకొంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాలంటైన్స్‌ డేను జరుపుకొంటారు. కానీ దేశ రాజధానిలోని ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధంగా ఉండే హిందూ కాలేజీ విద్యార్థులు మాత్రం ప్రతీ ఏటా విభిన్నంగా తమ వాలంటైన్స్‌ డైను ఘనంగా జరుపుకొంటారు. వారు జరుపుకొనే తీరు మాత్రం దేశంలో ఎవరూ జరుపుకోరు. హిందూ కాలేజీ విద్యార్థులు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొంటారిలా..

శృంగార దేవత వృక్షానికి పూజలు

శృంగార దేవత వృక్షానికి పూజలు

హిందూ కాలేజీ ఆవరణలో ఉన్న అతి పురాతన వృక్ష్యాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. దానికి శృంగార దేవత వృక్షంగా దానిని కొలుస్తారు. ఆ వృక్ష్యానికి రంగు రంగుల బెలూన్లు, నీటితో నింపిన కండోమ్స్ కడుతారు. అంతేకాకుండా ఆ చెట్టుకు సినీ తారల ఫొటోలు, పోస్టర్లను అలకరించి పూజలు చేస్తారు. ఆ వృక్షానికి దమ్‌దామి మాయి అని పిలుస్తారు.

శృంగార దేవతగా జాక్వలైన్ ఫెర్నాండేజ్

శృంగార దేవతగా జాక్వలైన్ ఫెర్నాండేజ్

ప్రతీ ఏటా జరిపే వాలంటైన్స్ డే పూజకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ సినీ తారను ఎంచుకొంటారు. ఈ ఏడాది ఎక్కువ హిట్లు సొంతం చేసుకొన్న బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్‌ను ఎంచుకొన్నారు. గతేడాది గూగుల్ బాగా వెతికిన సినీ తార దిశా పటానీ ఫొటోలను కట్టి ఆ వృక్షాన్ని పూజించారు.

 లవ్‌గురుగా రణ్‌వీర్ సింగ్

లవ్‌గురుగా రణ్‌వీర్ సింగ్

గతంలో 2013లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, 2014లో దీపికా పదుకొన్, 2015లో కత్రినా కైఫ్, 2016లో లీసా హెడెన్ ఫొటోలతో దమ్‌దామి మాయి వృక్ష్యాన్ని పూజించారు. ఈ ఏడాది కాలేజీ విద్యార్థులు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను తమ లవ్‌గురుగా ఎంచుకోవడం గమనార్హం.

బ్యాచ్‌లర్ లైఫ్‌ ముగుస్తుందని..

బ్యాచ్‌లర్ లైఫ్‌ ముగుస్తుందని..

వాలంటైన్ డే ఉత్సవాలను పురస్కరించుకొని హిందూ కాలేజీ హాస్టల్ అధ్యక్షుడు లలిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఏటా దమ్‌దామి మాయి వ‌ృక్షాన్ని ఎందుకు ఎంచుకొంటామంటే.. ఆ చెట్టును పూజిస్తే తమ బ్యాచ్‌లర్ (బ్రహ్మచర్యం) ముగిసి పోతుందని విద్యార్థులు బలంగా నమ్ముతారు. అందుకే ప్రతీ ఏటా ఆ చెట్టును పూజిస్తాం అని తెలిపారు.

 రొమాంటిక్ తారలుగా జాక్వలైన్, రణ్‌వీర్ సింగ్

రొమాంటిక్ తారలుగా జాక్వలైన్, రణ్‌వీర్ సింగ్

ఈ ఏడాది కొత్తదనం ఏమిటంటే దమ్‌దామి మాయి వృక్షానికి పూజించే జాక్వలైన్‌కు జంటగా ఈ సారి లవ్‌గురుగా రణ్‌వీర్‌ సింగ్‌ను ఎంచుకొన్నాం. వారిద్దరూ ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ తారలు. వారిద్దరికి యూత్‌లో మంచి డిమాండ్ ఉంది. శృంగార దేవత, లవ్ గురు హాదాకు జాక్వలైన్, రణ్‌వీర్ సరిపోతారు అని లలిత్ కుమార్ తెలిపారు.

 ప్రతీ ఏటా ప్రేమికుల దినోత్సవం నాడు

ప్రతీ ఏటా ప్రేమికుల దినోత్సవం నాడు

ప్రతీ ఏటా ఫిబ్రవరి 14 తేదీన కాలేజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం పూజలు నిర్వహిస్తారు. దమ్‌దామి కి జై హో అంటూ నినాదాలు చేస్తూ పూజారితో కలిసి విద్యార్థులందరూ దమ్‌దామి మాయ్ వృక్షం వద్దకు చేరుకొంటారు. పూజ అనంతరం మోతీ చూర్ కే లడ్డూను పంచిపెడుతారు. ఈ పూజలో ఇతర కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొంటారు.

 కండోమ్‌లో నింపిన నీటిని

కండోమ్‌లో నింపిన నీటిని

తమ ప్రేమను ద్వేషించే వ్యక్తులు తారసపడకూడదని పూజలు చేస్తారు. ఈ పూజలో పాల్గొనకుండా కాలేజీ లెక్చరర్లను దూరంగా ఉంచుతారు. పూజ అనంతరం నీటితో నింపిన కండోమ్స్‌ను దూరంగా ఉంచుతారు. కండోమ్‌లో నింపిన నీటిని పవిత్రంగా భావిస్తారు.

English summary
Valentine's Day might be celebrated in the city with enthusiasm but nothing beats the craze in Hindu College, Delhi University. The lonely hearts of Hindu College celebrate Valentine's Day in a unique fashion. They choose to do a puja, around a tree, which is adorned with posters of a popular actress. Jacqueline Fernandez and Ranveer Singh were chosen because they are the hottest and the most in-demand stars right now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu