»   » నితిన్ మూవీలో హాలీవుడ్ స్టార్.... (ఫోటోస్)

నితిన్ మూవీలో హాలీవుడ్ స్టార్.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జెరియాన్ కూడా నటిస్తున్నాడు.

ఒలంపస్ హాజ్ ఫాలెన్, ది ఈక్వలైజర్, వార్ డాగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలతో డాన్ బిల్జెరియాన్ నటించారు. డాన్ బిల్జెరియాన్ తన సినిమాలో నటిస్తున్నందుక ఆనందం వ్యక్తం చేస్తూ నితిన్ ట్వీట్ చేసారు.


డాన్ బిల్జెరియాన్

ప్రస్తుతం మా చిత్రం షూటింగ్‌ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో జరుగుతోంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.


నటీనటులు

నటీనటులు

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.


English summary
"Thanks DanBilzerian for being such a sport n for being part of our film..u r a total natural!! 😎#LIEthemovie" nithiin‏ tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu