Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అసలు విశ్వక్‌సేన్ హీరోనే కాదు.. అక్కడే చెప్పుతో కొట్టాల్సింది.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింతా అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లి కాని ఒక యువకుడు జీవితాన్ని కథగా మలిచి సినిమా తెరకెక్కించాడు. తన కులం అమ్మాయిలు ఎవరూ లేకపోవడంతో వేరే రాష్ట్రంలో మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన అల్లం అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఆ పెళ్లి కూడా క్యాన్సిల్ కావడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని ట్రైలర్ లో చూపించారు.

ప్రాంక్ ప్లాన్ చేసి
ముందు నుంచి కూడా పెళ్ళికాని కుర్రాడి కాన్సెప్ట్ అనడంతో ప్రేక్షకులలో సాధారణంగానే ఆసక్తి నెలకొంది. దాన్ని మరింత పెంచేందుకు గాను ప్రసాద్ ఐమాక్స్ వద్ద సినిమా చూసి రివ్యూలను తనదైన శైలిలోచెప్పి పేరు తెచ్చుకున్న లక్ష్మణ్ అనే వ్యక్తితో ఒక ప్రాంక్ ప్లాన్ చేసింది. ఆ ఫ్రాంక్ ప్రకారం సదరు వ్యక్తి విశ్వక్ సేన్ వెళుతున్న కారుకు అడ్డం పడి అల్లం అర్జున్ కుమార్ ను ఇప్పుడే కలవాలని లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటా అని హడావిడి సృష్టించాలి. అలా హడావుడి సృష్టించిన సమయంలో విశ్వక్ సేన్ అతనిని సముదాయించి అక్కడి నుంచి పంపించాలి.

నేరుగా స్టూడియోకి
ఇదంతా బాగానే ఉంది కానీ సదరు ఫ్రాంక్ చేసిన వ్యక్తి చేసిన ఓవరాక్షన్ ఎవరికీ నచ్చలేదు. నడిరోడ్డు మీద చనిపోతాను అంటూ హడావుడి సృష్టించడంతో ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. ఇదే విషయం మీద ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ నిర్వహిస్తూ ఉండగా అందులో విశ్వక్ సేన్ ఫోన్ ఇన్ ద్వారా పాల్గొన్నారు. తర్వాత తన గురించి ఇబ్బందికర మాటలు మాట్లాడుతూ ఉండటంతో నేరుగా స్టూడియోకి వెళ్ళాడు.

సైలెంట్ గా ఉండాలని
స్టూడియోకి వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్న యాంకర్ కు ఆయనకు మధ్య వివాదం చెలరేగింది. అయితే ఈ విషయంలో స్టూడియోలో జరిగిన వివాదం మీద మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. అసలు విశ్వక్ సేన్ ని మీరు హీరోగా భావిస్తున్నారు ఏమో కానీ మేం అయితే అతనిని హీరోగా గుర్తించడం లేదు, లైవ్ లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అక్కడ లేడీ యాంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న మహిళ అలాంటి మహిళ ముందుకు వెళ్లే ముందు, మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్లాలి లేదా సైలెంట్ గా ఉండాలని అన్నారు.

చెప్పు తీసుకుని కొట్టి ఉంటే
అంతేకానీ ఇలా సినిమా ప్రమోషన్స్ కోసం పబ్లిక్ రోడ్లమీద విశ్వక్ సేన్ అరాచకం సృష్టించకూడదు అని ఆయన అన్నారు. ఇక స్టూడియో లో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని అన్నారు. అంతేకాక సదరు మహిళా యాంకర్ తప్పు చేసిందని, అతను ఆ అసభ్యకరమైన మాట మాట్లాడినా సమయంలో చెప్పు తీసుకుని కొట్టి ఉంటే వాడికి బుద్ధి వచ్చేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సిగ్గు, లజ్జా లేకుండా
అంతేకాక మా మహిళలందరూ చెప్పులు తీసుకుని సిద్ధంగా ఉన్నారని బయట కనబడితే కొట్టి తీరతారని అన్నారు. విశ్వక్ సేన్ లాంటి దుర్మార్గుడిని సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను తాను కోరుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సిగ్గు, లజ్జా లేకుండా ఇలా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదు అన్న ఆయన మీ అమ్మ చెల్లి నీ పక్కనే ఉంటే కూడా అలాగే మాట్లాడతావా అని ప్రశ్నిస్తున్నాను అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. మరి ఈ విషయం మీద విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాల్సి ఉంది.