»   » హీరోయిన్లపై దారుణమైన సీన్లు, అసహజ శృంగారం.. దండుపాళ్యం-2 సెన్సార్ కష్టమే?

హీరోయిన్లపై దారుణమైన సీన్లు, అసహజ శృంగారం.. దండుపాళ్యం-2 సెన్సార్ కష్టమే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత భయానకమైన, హింసాత్మక సినిమాల లిస్టులో చోటు దక్కించుకున్న 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్ వస్తోంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ పబ్లిసిటీ మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు, వీడియోలు లీక్ చేస్తున్నారు. సినిమా గురించి మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఉద్దేశ్యంతో కావాలనే కొన్ని వివాదాస్పద సీన్లు సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


మరీ ఇంత దారుణంగా...

మరీ ఇంత దారుణంగా...

తాజాగా హీరోయిన్ సంజనకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. ఆమె ఇందులో దండుపాళ్యం గ్యాంగ్ సభ్యురాలిగా నటించింది. ఇన్స్‌స్పెక్టర్ చలపతి పాత్రలో నటించిన బొమ్మాళి రవిశంకర్ ఆమెను ఇంటరాగేషన్ పేరుతో హింసిస్తున్న లీక్ సీన్ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది.


నిజంగా ఇంటరాగేషన్ ఇలా ఉంటుందా?

నిజంగా ఇంటరాగేషన్ ఇలా ఉంటుందా?

సామాన్య ప్రజలు భయకంపితులయ్యేలా ఈ లీక్ సీన్లో సన్నివేశాలు ఉన్నాయి. ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ ఒక మహిళను జైల్లో నగ్నంగా మార్చి చేతులు కట్టేసి తీవ్రంగా కొడుతూ హింసిస్తారా? పోలీస్ థర్డ్ డిగ్రీ ప్రయోగం ఇంత కర్కశంగా ఉంటుందా? అని భయపడేలా ఈ లీక్ సీన్లో సన్నివేశాలు ఉన్నాయి.


సెన్సార్ అనుమతి లభిస్తుందా?

సెన్సార్ అనుమతి లభిస్తుందా?

ఇంత దారుణంగా సీన్లు ఉంటే దండుపాళ్యం 2 చిత్రానికి అసలు సెన్సార్ అనుమతి లభిస్తుందా? ఇలాంటి జుగుప్సాకరమైన సీన్లకు అనుమతి ఇస్తే ఎలాంటి విరమర్శలురావా? ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
అసహజ శృంగారం

ఇప్పటి వరకు అసహజ శృంగారానికి సంబంధించిన సీన్లు ఉన్న సినిమాలన్నీ వివాదాస్పదం అయ్యాయి. దండుపాళ్యం 2 మూవీలో ఇద్దరు మహిళల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉండటం కూడా వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.


 ఇంత హింస ఎప్పుడూ చూడలేదు

ఇంత హింస ఎప్పుడూ చూడలేదు

దండుపాళ్యం పార్ట్ 1 సినిమా చూసిన వారు ఇంత హింసాత్మక సినిమా ఎప్పుడూ చూడలేదని, దండుపాళ్యం గ్యాంగ్ ఆగడాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.


3 కోట్లతో 40 కోట్లు

3 కోట్లతో 40 కోట్లు

2012లో దండుపాళ్యం పార్ట్ 1 తొలుత కన్నడలో రిలీజైంది. అక్కడ విజయవంతం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి ఫలితాలే సాధించింది. అప్పట్లో కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 40 కోట్ల వసూలు చేసింది.


ఈ సారి మరో రికార్డు ఖాయం

తొలి భాగం పెద్ద హిట్ కాబట్టి ఇపుడు వచ్చే సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయని, ఈ సారి కన్నడ, తెలుగు మార్కెట్లో కలిపి కనీసం రెట్టింపు... అంటే దాదాపు రూ. 80 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


పార్ట్ 2లో ఏం చూపిస్తారు?

పార్ట్ 2లో ఏం చూపిస్తారు?

మొదటి భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ అఘాయిత్యాలు చూపెడితే.... పార్ట్ 2లో ఈ గ్యాంగ్ జైలు జీవితం గురించి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, పోలీసుల చేతిలో ఎలాంటి హింసలకు గురయ్యారు, జైలు నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు లాంటి సంఘటనలు చూపించబోతున్నారు.


సింగిల్‌ రిలీజ్ కోసం వెయిటింగ్

సింగిల్‌ రిలీజ్ కోసం వెయిటింగ్

వాస్తవానికి ఈ చిత్రాన్ని జులై 21న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ సమయంలో ఎక్కువ రిలీజ్‌లు ఉండటంతో విడుదల వాయిదా వేసినట్లు సమాచారం. పోటీ ఎక్కువగా లేని సమయం చూసి ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.English summary
Controversial movie 'Dandupalaya 2' has engulfed in another controversy after a nude video of actress Sanjjanaa Galrani from the film allegedly leaked online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu