»   » దండుపాళ్య-2 కొత్త ట్రైలర్... చూస్తే షాకవుతారు!

దండుపాళ్య-2 కొత్త ట్రైలర్... చూస్తే షాకవుతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దండుపాళ్యం' పేరు వింటే చాలు అతి భయంకరమైన సంఘటనలు మన కళ్ల ముందు మెదులుతాయి. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈచిత్రం తొలి భాగం విజయం సాధించింది. ఇపుడు ఈచిత్రాని సీక్వెల్ గా 'దండుపాళ్యం-2' తెరకెక్కుతోంది.

తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. లేటెస్టుగా మరో ట్రైలర్ విడుదల చేశారు.


ట్రైలర్లో షాకింగ్ సీన్లు

ట్రైలర్లో కొన్ని షాకింగ్ సీన్లు ఎక్స్‌ఫోజ్ చేశారు. మొదటి భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ అఘాయిత్యాలు చూపెడితే.... పార్ట్ 2లో ఈ గ్యాంగ్ జైలు జీవితం గురించి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. జైలు నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు లాంటి సంఘటనలు చూపించబోతున్నారు.


మేకింగ్ వీడియో

మేకింగ్ వీడియోలో... జైల్లో ఉన్న పూజాగాంధీ కి మరో ఖైదీ బలవంతంగా లిప్ లాక్ ముద్దు పెట్టే సన్నివేశాన్ని విడుదల చేశారు. నాటుగా, ఘాటుగా ఉన్న ఈ సీన్ సినిమాపై కాస్త వివాదం రేపడంతో పాటు, అందరి చూపు ఇటు వైపు పడేలా చేసింది.


ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు.


దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.English summary
Dandupalya 2 Kannada Movie Latest Trailer on Vivd Dreams. #Dandupalya2 latest 2017 movie ft. Pooja Gandhi Sanjana/Sanjana Galarani,, Ravi Shankar, Avinash, Shruthi, Makrand Deshpande and Ravi Kale. Directed by Srinivasa Raju. Produced by Venkat. Music composed by Arjun Janya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu