»   »  ‘దండుపాళ్యం’ దారుణాలు మళ్లీ చూడబోతున్నాం (ఫోటోలు)

‘దండుపాళ్యం’ దారుణాలు మళ్లీ చూడబోతున్నాం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకట్ మూవీస్ బ్యానర్ పై పూజాగాంధీ, రఘుముఖర్జీ, రవి కాలె ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం దండుపాళ్యం. అప్పట్లో ఈ చిత్రం కన్నడో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా దండు పాళ్యం 2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

సీక్వెల్ కూడా కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఆ మధ్య పార్ట్ 2కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ బోల్డ్ గా ఉంది. నేరస్తులందరినీ నగ్నంగా నిలబెట్టి తీసిన ఫోటోను విడుదల చేసారు.

'దండుపాళ్యం2' చిత్రం 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. బెంగళూరు, బెల్గావ్‌లలో షూటింగ్‌ చేయడం జరిగింది. దండుపాళ్యం తర్వాత మరో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో చేస్తున్న ఈ సీక్వెల్‌లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు.

నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చేయడం జరిగింది. మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను జూన్‌, జూలై నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

రియల్

రియల్


రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దండుపాళ్యం గ్యాంగ్ జరిపిన దారుణాలు ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు.

క్రైమ్

క్రైమ్


సినిమా కోసం నేను వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్ లో కూడా ఇంత పెద్ద స్పాన్ ఉంటుందా అనిపించింది అన్నారు దర్శకుడు.

మూడు కోణాల్లో...

మూడు కోణాల్లో...


పోలీస్ డిపార్ట్ మెంట్, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా ఉంటుంది.

ఉన్నదున్నట్లు

ఉన్నదున్నట్లు


నిజాన్ని ఉన్నదున్నట్లు ఈ చిత్రంలో చూపించబోతున్నామని దర్శకుడు స్పష్టం చేసాడు. ఇందులో కొన్ని సీన్లు ప్రేక్షకులు చూడటానికి ఇబ్బంది పడొచ్చు.

దండు పాళ్యం 2

దండు పాళ్యం 2


దండు పాళ్యం 2 చిత్రానికి సంబంధించి ఫోటోలు ప్రేక్షకులు షాకయ్యేలా ఉన్నాయి.

ఫస్ట్ లుక్ షాకే

ఫస్ట్ లుక్ షాకే


నేరస్తులందరినీ నగ్నంగా నిలబెట్టి తీసిన ఫోటోను ఫస్ట్ లుక్ గా ఆ మధ్య విడుదల చేసారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రధాన తారాగణం

ప్రధాన తారాగణం


వెంకట్ మూవీస్ బ్యానర్ పై పూజాగాంధీ, రఘుముఖర్జీ, రవి కాలె ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోంది.

క్రూరమైన గ్యాంగ్

క్రూరమైన గ్యాంగ్


దండుపాళ్యం అనే అనే గ్యాంగ్ కొన్ని క్రూరమైన సంఘటనలకు పాల్పడింది.

సినిమాగా..

సినిమాగా..


వారు చేసిన నేర సంఘటనలనే సినిమాగా తీస్తున్నారు.

షూటింగ్

షూటింగ్


'దండుపాళ్యం2' చిత్రం 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

రిలీజ్

రిలీజ్


ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

English summary
Dandupalya 2 releasing in September. Dandupalya created a new wave lenght in Kannada film industry. Dandupalya is based on real-life exploits of a notorious gang named Dandupalya. After long gap of 4 years, Dandupalya 2 is back in action.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu