»   » దండుపాళ్యం డైరెక్టర్ మరో సంచలనం: ‘ఆచార్య అరెస్ట్... ప్రతి హిందువుకు అవమానం’

దండుపాళ్యం డైరెక్టర్ మరో సంచలనం: ‘ఆచార్య అరెస్ట్... ప్రతి హిందువుకు అవమానం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'దండుపాళ్యం' లాంటి సెన్సేషనల్, కాంట్రవర్సల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాసరాజు మరో సంచలన సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి ఆయన అత్యంత వివాదాస్పద సబ్జెక్ట్... కంచి పీఠమ్ స్వామీజీ శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్టు ఉదంతాన్ని సినిమాగా తీయబోతున్నారు.

'ఆచార్య అరెస్ట్' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఇన్సల్ట్ టు ఎవ్రీ హిందూ'(ప్రతి హిందువుకు అవమానం) అనేది ట్యాగ్ లైన్. దాదాపు రెండు సంవత్సరాల పాటు స్వామిజీతో సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తులను, ఈ కేసుకు సంబంధించిన వారిని కలిసి ఈ స్క్రిప్టు రెడీ చేశారు. ఎస్సార్టీ ఎంటర్టెన్మెంట్ బేనర్లో రామ్ తుల్లూరి ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు.


2004లో జరిగిన హత్యోదంతం ఆధారంగా

2004లో జరిగిన హత్యోదంతం ఆధారంగా

తమిళనాడులోని కంచి పీఠంలో 2004లో భక్తుడి హత్య జరిగింది. ఈ కేసుకు సంబంధించి జయేంద్ర సరస్వతిని అరెస్టు చేశారు. అసలు అప్పుడు ఏం జరిగింది? ఈ కేసు వెనక ఉన్న అసలు వాస్తవాలేమిటి? అనేది సినిమా ద్వారా చూపించనున్నారు.


ఎన్నో ఆసక్తికర విషయాలు

ఎన్నో ఆసక్తికర విషయాలు

ఈ కేసు వెనక ఎన్నో కుతంత్రాలు, రాజకీయ కోణాలు, మతపరమైన కుట్రలు ఉన్నాయని రూమర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని కోణాలను సినిమాలో ఫోకస్ చేయబోతున్నారని సమాచారం.


జయేంద్ర సరస్వతి వెర్షన్ కూడా

జయేంద్ర సరస్వతి వెర్షన్ కూడా

ఈ సినిమాలో జయేంద్ర సరస్వతి వెర్షన్ కూడా చూపించబోతున్నారు. ఆయన ఈ కేసులోకి ఎలా వచ్చారు, అరెస్టుకు దారి తీసిన అంశాలు ఏమిటి? చూపించబోతున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ ఇలా ఐదు బాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నటీనటుల ఎంపిక ఇంకా జరుగలేదు, త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

'దండుపాళ్యం' పేరు వింటే చాలు అతి భయంకరమైన సంఘటనలు మన కళ్ల ముందు మెదులుతాయి. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈచిత్రం తొలి భాగం విజయం సాధించింది. ఇపుడు ఈచిత్రాని సీక్వెల్ గా 'దండుపాళ్యం-2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దండుపాళ్య-2 కొత్త ట్రైలర్... చూస్తే షాకవుతారు!


ట్రైలర్ చూసేందుకు క్లిక్ చేయండిEnglish summary
Srinivas Raju, the Director of sensational and controversial 'Dandupalyam' series is getting ready for another sensation with his next film. After depicting the horrific things of 'Dandupalyam' gang in a natural and gritty manner, Srinivas Raju has drawn motivation from another real incident for his next venture. This time he will be showcasing the events revolving around the arrest of Kanchi Peetam Swaamiji, Shankaracharya Jayendra Saraswati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu