»   » దంగల్ బాలికకి రోడ్డు ప్రమాదం, దాల్ లేక్ లోకి దూసుకుపోయిన కారు

దంగల్ బాలికకి రోడ్డు ప్రమాదం, దాల్ లేక్ లోకి దూసుకుపోయిన కారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జైరా వసీం... దంగల్ సినిమాలో గీతా ఫోగట్ యంగ్ రోల్ ప్లే చేసిన ఓ 16 ఏళ్ల అమ్మాయే ఈ జైరా. దంగల్ సినిమా రిలీజ్‌కి ముందు ఎక్కడా అంతగా ప్రచారంలో లేని ఈ పేరు సినిమా రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అయిపోయింది. 'దంగల్‌'లో తన సహజ నటనతో మెప్పించిన నటి జైరా వాసిమ్‌ తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 జైరా వాసిమ్‌

జైరా వాసిమ్‌

గురువారం జైరా వాసిమ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బౌలేవార్డ్ రోడ్ సమీపంలో దాల్‌ లేక్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. జైరా వాసిమ్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నఓ వ్యక్తికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.


గాయాలు కాలేదు

గాయాలు కాలేదు

అయితే జైరాకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. కాగా కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఆమధ్య వరుస వివాదాలతో మరింత ఫేమస్ అయ్యిందీ అమ్మాయి.


దంగల్ సూపర్ సక్సెస్

దంగల్ సూపర్ సక్సెస్

తన సినిమా ఇచ్చిన కిక్కుతో చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దంగల్ సూపర్ సక్సెస్ నేపధ్యంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినిమాలో తన పాత్రను కాశ్మీర్ అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. దీనితో కాశ్మీర్ వేర్పాటువాదులు మండిపడ్డారు.


క్షమించాలని వేడుకుంది

క్షమించాలని వేడుకుంది

వేర్పాటువాదుల హెచ్చరికలతో వెంటనే తను చేసిన వ్యాఖ్యలను వాపసు తీసుకోవడంతోపాటు క్షమాపణలు చెపుతున్నట్లు బహిరంగ లేఖను విడుదల చేసింది జైరా. తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని వేడుకుంది. అంతేకాకుండా... కాశ్మీరీ యువతకు రోల్ మోడల్‌గా చిత్రంలో నన్ను చూపించారనీ,
 జాతీయ గీతం వస్తున్నా

జాతీయ గీతం వస్తున్నా

ఐతే ఆ పాత్రలో తను వున్నట్లుగా ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని తెలిపింది. ఆతర్వాత తన సినిమా చూడటానికి వెళ్ళి థియేటర్ లో జాతీయ గీతం వస్తున్నా నిలబడకుండా ఉండి ఇంకో సారి వివాదం లో ఇరుక్కుంది. ఇలా తన సినిమా కంటే వివాదాల్లోనే ఎక్కువ పాపులర్ అయిన ఈ అమ్మాయి ప్రమాదం లో గాయపడ్డ సంగతి కాస్త ఆలస్యంగానే బయటికి వచ్చింది.English summary
Zaira Wasim's car fell into the Dal Lake afte the driver lost control. Zaira and her co-passengers was rescued by some local people
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu