»   » దీన్నే క్యామిడీ అంటారు..... ఆ సినిమాకి మళ్ళీ "బాహుబలి" అనే పేరా?

దీన్నే క్యామిడీ అంటారు..... ఆ సినిమాకి మళ్ళీ "బాహుబలి" అనే పేరా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ దేశ, విదేశాలకు పాకింది. ప్రభాస్‌ని ఇష్టపడేవారి సంఖ్య అమితంగా పెరిగింది. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్న కొందరు నిర్మాతలు కొత్త స్కెచ్‌లు వేస్తున్నారు. ప్రభాస్ నటించిన తెలుగు చిత్రాలను వేరే భాషలలో డబ్ చేసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు.అందుకే 'రెబల్', 'మిర్చి'లాంటి చిత్రాలను కోలీవుడ్, మాలీవుడ్‌లో రిలీజ్ చేసి ఫుల్ సక్సెస్ అయ్యారు. తాజాగా వీరి దృష్టి 'డార్లింగ్' చిత్రంపై పడింది. కరుణాకరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో తమిళులకు ఈ సినిమాపై మోజు పెరిగింది.

ఈ నేపధ్యంలో ప్రభాస్ తెలుగులో చేసిన డార్లింగ్ చిత్రం తమిళంలో 'ప్రభాస్ బాహుబలి' పేరుతో జూలై 15న విడుదల కానుంది. డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించగా, ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు తమిళ ఫ్లేవర్ కాస్త ఎక్కువగా ఉండడంతో తమిళ తంబీలు కూడా సినిమాను ఆదరిస్తారని చెబుతున్నారు.

darling telugu movie in tamil as prabhas bahubali

అలాగే కాజల్‌కు ఇపుడు కోలీవుడ్‌లో మాంచి సీన్ ఉంది కాబట్టి... ఈజీగా వర్కవుట్ అవుతుందనే ధీమాతో ఉంది సినిమా యూనిట్. 'రెబల్', 'మిర్చి' తరహాలోనే 'బాహుబలి' పేరు చెప్పి 'డార్లింగ్' కూడా వర్కవుట్ అయ్యేలా అక్కడి మీడియా ప్రచారం చేయడం విశేషం

తమిళంలోను భారీ హిట్ కొట్టేందుకు చిత్ర టైటిల్ విషయంలో కాస్త కొత్తగా ఆలోచించారు చిత్ర బృందం. మరి ప్రభాస్ బాహుబలి అనే టైటిల్ చిత్ర విజయంలో ఎంత మేరకు భాగం అవుతుందో చూడాలి.

English summary
Actor Prabhas is a national star now thanks to the phenomenal success of Baahubali. Some of Prabhas’ earlier films such as Mirchi, Mr. Perfect, Rebel and Chatrapathi etc were dubbed into Malayalam and Tamil. Now, his 2010 super hit romantic drama, Darling, is set to be released soon in Tamil as Prabhas Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu