»   » ‘అత్తారింతికి దారేది’పై దాసరి కామెంట్!

‘అత్తారింతికి దారేది’పై దాసరి కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దర్శకతర్న దాసరిని నారాయణరావుకు స్పెషల్ షో చూపించారని, సినిమా చూసిన తర్వాత దాసరి హ్యాపీగా ఫీలయ్యారని, దర్శకుడి పనితీరును, పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో పవన్ బాగా చేసారని అభినందించారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఒక్క ఇండియాలోనే కాదు...ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమా కలెక్షన్లు రికార్డులు స్థాయిలో వస్తున్నాయి. త్వరలోనే ఈచిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫ్యామిలీ, యూత్, క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రం ఉండటం సినిమాకు బాగా ప్లస్సయింది. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Producer BVSN Prasad has also arranged a special show of 'atharintiki daaredi' for Dasari Narayana Rao. Dasari lauded the performance of Pawan Kalyan in climax of movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu