»   »  ఫోన్ లో చిరును పరామర్శించిన దాసరి

ఫోన్ లో చిరును పరామర్శించిన దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu
తండ్రి కొణిదెల వెంకట్రావ్ మరణించడంతో తెలుగు సినిమా పరిశ్రమలోని వ్యక్తులతో పాటు రాజకీయ నాయకులు చాలామంది చిరంజీవిని పరామర్శించారు. కొందరు నేరుగా భౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులు అర్పించగా మరికొందరు ఫోన్ లో చిరంజీవిని పరామర్శించారు. సినీ పరిశ్రమకు చెందినవారిలో కె రాఘవేంద్రరావు, ఎంఎస్ రెడ్డి, బాలకృష్ణ, అశ్వనీదత్, ప్రభుదేవా, బ్రహ్మానందం, ఎస్వీ ప్రసాద్, రాజమౌళి, ఆర్ నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, వెంకటేష్ నేరుగా వచ్చి చిరంజీవిని పరామర్శించి వెళ్లారు. రాజకీయ నాయకులలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరంజీవిని ఫోన్ లో పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు, పీసీసీ మాజీ చీఫ్ కేశవరావు, ఎర్రన్నాయుడు, ఆర్టీసి ఎండీ దినేష్ రెడ్డి నేరుగా అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించారు. చిరంజీవి అభిమానులు పెద్దయెత్తున వస్తుండడంతో గాయత్రిహిల్స్ లో ఉన్న వెంకట్రావు నివాస ప్రాంతం జనసమ్మర్దంతో నిండిపోయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X