»   » పవన్‌ కూడా నన్ను అడగలేదు:దాసరి (దాసరి పుట్టిన రోజు వేడుక ఫొటోలు)

పవన్‌ కూడా నన్ను అడగలేదు:దాసరి (దాసరి పుట్టిన రోజు వేడుక ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాకు మొదట పుట్టిన రోజులు జరుపుకునే అలవాటు లేదు. కానీ నా భార్య పద్మ 1975 నుంచి వరసగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించింది. ఆమె చనిపోయిన ఏడాది నేను ఈ వేడుకలను దారంగా ఉన్నాను. ఆ తర్వాత నా శిష్యులు, అభిమానులే వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎక్కడో పాలకొల్లులో పేద కుటుంబంలో పుట్టాను నేను. ఎవరి సపోర్టు లేకుండా పరిశ్రమలో ఎదిగాను. అందుకు కృషి , పట్టుదల కారణాలయ్యాయి. ఇవాల్టి యువతలో చాలా మందిలో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. వారికి నా జీవితం గుణపాఠంలో ఉంటుందనే ఈ వివరాలన్నీ చెబుతున్నారు. ఎవరైనా కృషి, పట్టుదలను నమ్ముకుంటే తప్పకుండా ఎదుగుతారు అని చెప్పారు. దాసరి 71 జన్మదినోత్సవం హైదరాబాద్ లోని ఈ స్వగృహంలో సోమవారం జరిగింది.

దర్శకుడు కుర్చీకి గౌరవం తెచ్చిన వారిలో దాసరి పేరు ముందు వరసలో ఉంటుంది. ఎంతోమంది స్టార్స్ ని తయారు చేసిన నేర్పు ఆయన సొంతం. ఇప్పటికీ ఆయన ఆలోచనలకు పదును పెడుతూనే ఉన్నారు. ఇప్పుడాయన నిర్మాతగా బిజీ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌తో త్వరలోనే ఓ చిత్రం రూపొందిస్తున్నారు. సోమవారం దాసరి పుట్టిన రోజ. ఆయన పుట్టిన రోజుని ఇండస్ట్రీ ఘనంగా జరుపుకుంది. ఆ ఫోటోలు మీ కోసం...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అవి గోల్డెన్‌ డేస్‌. నేనొక్కణ్ణే కాదు, మొత్తంగా ఇండస్ట్రీ డిసిప్లినే అట్లా అండేది. తెల్లవారుఝామున ఐదు గంటలకే సెట్స్‌పై సందడి మొదలయ్యేది. క్రమేణా మనుషులు మారిపోయారు. గోల్డెన్‌స్పూన్‌తో పుట్టిన నియో రిచ్‌ మనుషులు, డైరెక్టర్‌ అనేవాడికి ఏమీ అనుభవం అవసరంలేదు, క్రియేటివిటీ ఉంటే చాలనుకునే సూడో ఇంటలెక్చువల్స్‌ ఇండస్ట్రీలోకి వచ్చారు.

వాళ్ల సౌలభ్యానికి తగ్గట్లు పరిశ్రమను మార్చుకున్నారు. కాబట్టి ఇవాళ ఇండసీ్ట్రని చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు కంట్రోలింగ్‌ రిమోట్‌ అనేది పోయింది. పూర్వం ఫిల్మ్‌ చాంబర్లు, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిళ్లు కంట్రోల్‌ చేసేవి. సీరియస్‌ చర్యలు ఉండేవి. ఇప్పుడు చాంబర్‌ అనేది ఉందో, లేదో తెలీదు. కౌన్సిల్‌ కూడా ఉండీ లేనట్లే. పేరుకి ఉన్నాయ్‌. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు దాసరి నారాయణ రావు.

అప్ డేట్ అవ్వాలి

అప్ డేట్ అవ్వాలి

''దర్శకుడు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలి. ఎందుకంటే సృజన ఎప్పుడూ ఆగిపోకూడదు. రాజ్‌కపూర్‌, పుల్లయ్య వీళ్లంతా చనిపోయేంత వరకూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. నేనూ అంతే'' అంటున్నారు దాసరి నారాయణరావు.

పవన్ సీరియస్ గా తీసుకున్నాడు

పవన్ సీరియస్ గా తీసుకున్నాడు

దాసరి - పవన్‌ కల్యాణ్‌ కలయిక.. పరిశ్రమలో చర్చనీయాంశమైపోయింది. అది కేవలం పవన్‌ కల్యాణ్‌ గొప్పతనం. తను నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న హీరో. తనంతట తానే.. 'మనం కలసి ఓ సినిమా చేయాలి..' అన్నాడు. 'ఏదో మాట వరసకు చెబుతున్నాడులే..' అనుకొన్నా. కానీ.. తను మాత్రం సీరియస్‌గా తీసుకొన్నాడు.

ఆశ్చర్యపరిచింది

ఆశ్చర్యపరిచింది

ఈరోజుల్లో కూడా పెద్దరికానికి ఇంత గౌరవం ఇచ్చేవాళ్లున్నారా? అనిపించింది. నిజంగా పవన్‌ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరిచింది. చిన్నప్పటి నుంచీ తనని చూస్తూనే ఉన్నా. 'లంకేశ్వరుడు' సినిమా సమయంలో మా మధ్య పరిచయం పెరిగింది.

కుండబద్దలుకొట్టినట్టు...

కుండబద్దలుకొట్టినట్టు...

పవన్ కి దర్శకత్వం అంటే ఆసక్తి. అయితే.. 'పవన్‌ నటుడైతే బాగుంటుంది..' అనిపించేది. అలానే పెద్ద హీరో అయ్యాడు. తనలో నిజాయతీ నాకు బాగా నచ్చింది. ఏదైనా కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడుతుంటాడు.

తృప్తి ఉంది..

తృప్తి ఉంది..

దర్శకుడిగా నాకు చెప్పలేనంత తృప్తి ఉంది. అది భగవంతుడు నాకిచ్చిన అదృష్టమనుకుంటాను. ఇంతమంది శిష్యులు, చిన్నదైనా ఇంత పెద్ద ప్రపంచం, అందులో నేనో ముఖ్యమైన మనిషిని. అంతకంటే జీవితంలో మనిషికి కావాల్సింది ఏముంది! ఎక్కడో పుట్టి, ఇవాళ ఈ స్థానంలో ఉండటమంటే.. కేవలం రంగస్థలమనే తల్లి చేసిన సాయం. కాకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు చూస్తుంటే, ఇంకా సినిమాలు తియ్యడం అవసరమా.. అనిపిస్తుంటుంది.

వింటున్నా...

వింటున్నా...

బయటి కథలు వింటున్నా. ఎందుకంటే.. నేను ఫ్లాపులలో ఉన్నాను. పవన్ ... సూపర్‌ హిట్‌ హీరో. తన ఇమేజ్‌నీ కెరీర్‌నీ పణంగా పెట్టి నేను సినిమా చేయలేను. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే.. అభిమానులు నొచ్చుకొంటారు. పైగా ఈనాటి తరానికి ఏదో కావాలి. నాబోటి వాడు ఇంకేదో ఇస్తానంటాడు.

అలాంటి కథలోనే..

అలాంటి కథలోనే..

పవన్‌ తరహాలోనే వినోదం, యాక్షన్‌ ఇవన్నీ మేళవించిన కథతోనే ఈ సినిమా ఉంటుంది.

పవన్ అడగలేదు..

పవన్ అడగలేదు..

పవన్‌కీ ఇటు నాకూ రాజకీయాలతో సంబంధం ఉంది. పొలిటికల్‌ సెటైర్‌ తీయొచ్చు కదా అంటే... దానికి ఇది సమయం కాదు. పవన్‌ కూడా ఆ విషయం నన్ను అడగలేదు. నిజంగా ఇది ఎన్నికల సమయం అయితే..అదే తీద్దునేమో.?

‘జులాయి' పరిస్దితి మారింది..

‘జులాయి' పరిస్దితి మారింది..

ఇదివరకు ‘జులాయి' అనే సినిమాని రూ. 22 కోట్లకు కొన్నాం. ఇవాళ అదే హీరో, అదే డైరెక్టర్‌, అదే ప్రొడ్యూసర్‌తో మూడేళ్ల గ్యాప్‌తో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి'కి రూ. 60 కోట్ల పైనే అయ్యింది. ఎక్కడి రూ. 22 కోట్లు, ఎక్కడి రూ. 60 కోట్లు? అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఉదాహరణ కోసమే ఈ సినిమా గురించి చెప్పాను. ఈ ఒక్క సినిమానే కాదు, అన్ని సినిమాలూ ఇదే రేంజ్‌లో వెళ్లాయి.

ప్రొడ్యూసర్స్‌ సిండికేట్‌ గురించి..

ప్రొడ్యూసర్స్‌ సిండికేట్‌ గురించి..

కౌన్సిల్‌ను, చాంబర్‌ను నడపాల్సిన వాళ్లే రూల్స్‌ను అతిక్రమించే వాళ్లయ్యారు. అంటే లా క్రియేటర్స్‌ బికమ్‌ లా బ్రేకర్స్‌. ఇప్పుడిప్పుడే వింటున్నాను, వాళ్లు సపరేట్‌ సిండికేట్‌ పెట్టుకుంటున్నారని. ఇండసీ్ట్రలో ఎన్నో వచ్చినయ్‌, ఎన్నో పోయినయ్‌. కానీ ఇండసీ్ట్ర మాత్రం అలాగే ఉంది. ఇండసీ్ట్ర బాగుకోసమే ఈ సిండికేట్‌ పెడితే, అప్పుడు ఆలోచిద్దాం.

English summary
On the eve of his birthday today, Dasari Narayana spoke to some leading media houses to say that decisions taken by producers always lead to increased in budgets.
Please Wait while comments are loading...