»   » చిన్నతనంలో పేదరికం: దాసరి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు....

చిన్నతనంలో పేదరికం: దాసరి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడిగా బాగా ఎదిగిన తర్వాత దాసరికి హైదరాబాద్ లోని ఖరీదైన జూబ్లీ హిల్స్ ఏరియాలో పెద్ద బంగళా.... కారు, ఇంకా ఆస్తులు వచ్చాయి కానీ, ఆయన చాలా పేదరికం నుండి ఈ స్థాయికి ఎదిగారని కొందరికి మాత్రమే తెలుసు.

పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించారు దాసరి నారాయణరావు. ఇకప్పుడు వారిని బాగా బ్రతికిన కుటుంబమే అయినా.... పొగాకు వ్యాపారంలో నష్టాలు రావడంతో మా కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులో పడిందని, దాని కారణంగా తనను ఆరో క్లాసులోనే చదువు మాన్పించారని దాసరి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నెలకు రూపాయి జీతానికి వడ్రంగి పనిలో

నెలకు రూపాయి జీతానికి వడ్రంగి పనిలో

నేను ఆరోతరగతికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజుకి మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక నన్ను బడి మాన్పించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ నా జీతం నెలకి రూపాయి అని దాసరి గతంలో ఓ పత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.

అందరూ చందాలు వేస్తే చదువుకున్నాడు

అందరూ చందాలు వేస్తే చదువుకున్నాడు

ఉత్తమ విద్యార్థిగా ఉన్న తనను స్కూలు మాన్పించారనే విషయ తెలిసి మా మాస్టారు మా ఇంటికి వెళ్లి మా నాన్నను నిలదీసారు. తకు అంత స్తోమత లేదని మా నాన్న చెప్పడంతో వీణ్ని నేను చదివిస్తాను అని మా మాస్టారు నన్ను స్కూలుకి తీసుకెళ్లారు. నా చదవుకు సాయం చేయాలని నా తోటి విద్యార్థులను కోరగా వారంతా జేబులో ఉన్న అణాలు, బేడలూ తీసి టేబుల్‌ మీద పెట్టారు. స్కూలు ఫీజుకు సరిపడా డబ్బు పోగయింది. ఆ సంఘటన తలచుకుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అని దాసరి అన్నారు.

ఆకలి తీర్చుకోవడం కోసం హిందీ క్లాసులకు

ఆకలి తీర్చుకోవడం కోసం హిందీ క్లాసులకు

పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్న తాను వాటిని కూడా నా స్నేహితుల దగ్గర తీసుకునేవాణ్ని. బడి అయిపోయాక ఒక అరగంట సేపు హిందీ క్లాస్‌ ఉండేది. అందులో చేరాను. హిందీ నేర్చేసుకుందామని కాదు.. అప్పట్లో హిందీ నేర్చుకునేవారికి ప్రోత్సాహకంగా రోజూ తినడానికి ఇడ్లీ, దోసె.. ఇలా ఏదో ఒక టిఫిన్‌ పెట్టేవారు. ఆకలి తీర్చుకోవడానికి హిందీ క్లాసులో చేరాను అని దాసరి చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో

హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో

చదవు పూర్తయ్యాక హైదరాబాద్‌ చేరుకుని ఓ చిన్న ఉద్యోగం సంపాదించాను. తెల్లవారుజామునే మూడింటికే లేచి నాలుగు చపాతీలు, పప్పు చేసుకుని బాక్స్‌లో పెట్టుకుని నడుచుకుంటూ నాంపల్లి దాకా వచ్చేవాణ్ని. అక్కడ బస్సెక్కి సనత్‌నగర్‌లో దిగేవాణ్ని. అప్పట్లో బస్సులు సనత్‌నగర్‌ దాటి వెళ్లేవి కావు. అక్కణ్నుంచి బాలానగర్‌ దాకా నడచుకుంటూ వెళ్లే వాన్ని. మధ్యాహ్నం ఒంటిగంటకి డ్యూటీ అయిపోయాక మళ్లీ అలాగే నడుచుకుంటూ వచ్చేవాడిని అని దాసరి తెలిపారు.

అప్పటి నుండే నాటకాల్లో

అప్పటి నుండే నాటకాల్లో

నాకు చిన్నప్పటి నుండి నాటకాలంటే చాలా ఇష్టం. డ్యూటీ అయిపోయాక నాటకాల రిహార్సల్స్‌ చేసేవారం. పాలకొల్లులో నా మిత్రులతో కలిసి స్థాపించిన ‘శ్రీ క్షీరారామ ఆర్ట్‌ థియేటర్‌' తరఫున ఇక్కడా నాటకాలు వేయడం మొదటుపెట్టాం. రవీంద్రభారతిలో తప్పనిసరిగా నెలకొకసారైనా నాటకం వేసేవాళ్లమని దాసరి తెలిపారు.

English summary
Dasari Narayana Rao (4 May 1942 – 30 May 2017) was an Indian film director, dialogue writer, actor, and lyricist known for his works predominantly in Telugu cinema, and few Bollywood films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu