»   » దాసరికి ‘ఫేస్‌బుక్‌’ వేధింపులు...పోలీస్ కంప్లైంట్

దాసరికి ‘ఫేస్‌బుక్‌’ వేధింపులు...పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఏ స్ధాయిలో సెలబ్రెటీలకు ఉపయోగపడుతున్నాయో..అదే స్దాయిలో వారికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఈ ఫేస్ బుక్ సమస్యకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఇబ్బందిపడుతున్నారు.

ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, చనిపోయారని కొంతమంది ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఈ విషయం ఆయన అభిమానులు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో తాను చనిపోయినట్టు కొంతమంది ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ దాసరి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Dasari Narayana rao death rumour, facebook

దీనిపై వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు, కేసును సైబర్‌ క్రైంకు బదీలీ చేశారు. నిందితుణ్ణి గుర్తించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం దాసరి నారాయణ...పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి 150 చిత్ర కథపై దాసరితో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

English summary
A death hoax post upon legendary director Dasari Narayana Rao is being rampant from a while.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu